షర్మిల కాన్వాయి ఆపేశారు..! కారణం అదే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల బస్సు యాత్ర పేరిట ప్రచారాలు చేస్తున్నారు. అయితే నేడు ఆమె ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలుకు చేరుకున్నారు. అక్కడి అభ్యర్థి శ్రీనివాస నాయుడు తరఫున ప్రచారం చేయడానికి వచ్చిన షర్మిల వేదిక కి రాకుండా కొంత దూరంలో 15 నిమిషాల పాటు కాన్వాయ్ ని ఆపేయమన్నారట. కారణం ఏంటి అనుకుంటున్నారా..? ఆమె వేధిక వద్దకి షర్మిల అనుకున్నంత మంది జనం రాలేదు. జనం రాలేదని సమాచారం రాగానే ఆమె కాన్వాయ్ ని ఆపేయమని ఆదేశించారట.

దేవరాపల్లి నుంచి నిడదవోలుకు ఆమె బస్సు యాత్ర ప్రవేశించగా, సంత మార్కెట్ రోడ్డులో కాన్వాయ్ నిలిచిపోయింది. అప్పటికే స్థానిక పొట్టి శ్రీరాములు సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు వెళ్లిన పలువురు నాయకులు, జనాలు పలచగా ఉన్నారన్న విషయాన్ని కాన్వాయ్ కి చేరవేయగా ఆమె కాసేపు వేచి చూశారు. ఆ పదిహేను నిమిషాల వ్యయంలో కొంత జనం మళ్ళీ పెరగడంతో ఆపై ఆమె సభకి చేరుకున్నారు. సభ లో ఆమె ప్రసంగిస్తూ.. వైఎస్ఆర్ పాలనను మరోసారి చూడాలంటే జగనన్నను సీఎం చేయాలని సూచించారు. చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని, ఏ రైతుకైనా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందా? అని షర్మిల ప్రశ్నించారు. ఎన్నికలకు రెండు నెలల ముందు పెన్షన్లను పెంచుతున్నట్టు ప్రకటించిన చంద్రబాబు, మిగతా నాలుగున్నరేళ్లలో పెన్షన్లు ఎందుకు పెంచలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మరోసారి రాజన్న పాలన కావాలంటే ఈసారి అందరూ జగనన్నకి ఓటు వేయాలని ఆమె ప్రజలకి చెప్పారు.

Share.

Comments are closed.

%d bloggers like this: