అవినీతి రహిత సమాజం పవన తోనే సాధ్యం- ఆకుల..!

Google+ Pinterest LinkedIn Tumblr +

జనసేన రాజమండ్రి ఎంపీ అభ్యర్థి ఆకుల సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు.. ఆయన మాట్లాడుతూ.. రేపు తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొంటారని ఆయన తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఉదయం10 గంటలకు రాజనగరం నియోజకవర్గం సీతానగరంలో బహిరంగ సభ తో ప్రారంభమవుతుంది అని ఆయన తెలిపారు. తదుపరి మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి సుబ్రమణ్య మైదానంలో నిర్వహించిన సభలో పాల్గొంటారు అని తెలిపారు. జనసేనకు ప్రజలే కొండంత అండ అని కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఆవిర్భవించిన జనసేన పార్టీకి ప్రజల అండదండలు మెండుగా ఉన్నాయని రాజమహేంద్రవరం జనసేన పార్టీ ఎంపి అభ్యర్థి ఆకుల సత్యనారాయణ అన్నారు.

దశాబ్దాల కాలంగా, ఆ రెండు పార్టీలే పాలిస్తున్నాయని, వీరి హయాంలో సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు సక్రమంగా అందలేదన్నారు. ప్రజలకు సేవ చేయడంలో ఆ రెండు పాలక వర్గాలు విఫలమయ్యాయన్నారు. అవినీతి రహిత సమాజాన్ని నిర్మించేందుకు పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారని ఆయన అన్నారు. జనసేన పార్టీ ద్వారా స్వచ్ఛమైన పరిపాలన అందించేందుకు ముందుకు వచ్చిందన్నారు‌‌. గాజు గ్లాస్ గుర్తుపై ఓటేసి, తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు ఆకుల సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: