టీడీపీ అధినేత చంద్రబాబు ప్రవేశ పెట్టిన పసుపు కుంకుమ పథకం ఎంతగానో ప్రజాధరణ పొందింది. పసుపు కుంకుమ పథకం కింద డ్వాక్రా సంఘాల మహిలలకి రూ.10వేలు ఇస్తామని టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో డ్వాక్రా సంఘాల మహిళల ముఖాల్లో సంతోషపు చిరునవ్వులు కనబడ్డాయి. మూడు విడతల చెక్కులు వారికి అందాయి.. కాగా ఫెబ్రవరి, మార్చి నెలల్లో మహిళలు చెక్ ల ద్వారా నిధులు కూడా అందుకున్నారు. ఇక చివరి చెక్ ఏప్రిల్ నెలలో వేసుకోవలసి ఉంది. ఇంతలేనే ప్రతిపక్ష నేతలు ఈ పథకం పై వేటు వేయడానికి ప్రయత్నించాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉందని ఇలాంటి సమయాల్లో ఇలాంటి పథకాల ద్వారా డబ్బు పంచడానికి వీల్లేదని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మూడో విడుత నిధులను విడుదల చేయొద్దంటూ అనిల్ కుమార్ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఎన్నికల సంఘం టీడీపీ వర్గాల వాదనలు ఢిల్లీ హై కోర్ట్ వినింది. ఎన్నికల సంఘం పసుపు కుంకుమ పథకం గతంలో నుంచే అమలులో ఉందని ఎన్నికల కోడ్ వచ్చిన తరువాత ప్రారంభం అవ్వలేదని తమకి ఈ పథకంతో ఎటువంటి వ్యతిరేకత లేదని తెలిపింది. ఎన్నికల కోడ్ కి ఈ పథకం విరుద్ధం కాదని తేల్చిచెప్పింది. ఇక టీడీపీ వర్గాలు కూడా వారి వాదనల్లో ఈ విషయాలనే ప్రస్తావించాయి. ఇక ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్ట్ చట్టపరంగా ఎటువంటి ఉల్లంఘన లేనప్పుడు పథకాన్ని అమలు చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. మూడవ విడత నిధులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో డ్వాక్రా సంగాల మహిళలకి మూడవ విడత నిధులు కూడా అందుతున్నాయని స్పష్టమయ్యింది.