నేను విన్నాను.. నేను ఉన్నాను..!.. జగన్ మ్యానిఫెస్టో..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఉగాది సంధర్భంగా.. పంచాంగ శ్రవణం దాటిన తరువాత ఆయన మ్యానిఫెస్టోని విడుదల చేశాడు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో.. జగన తన చేతుల మీదుగా శనివారం (06-04-2019) ఉదయం 10 గంటలకు మేనిఫెస్టో విడుదల చేశారు. ‘’నేను విన్నాను.. నేను ఉన్నాను’’ అనే పేరుతో ఈ మ్యానిఫెస్టో ని రూపు కల్పించారు. తాను రాష్ట్రం అంతా తిరిగి పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు విని వాటికి పరిష్కారం చేయాలనే దృక్పదంతో మ్యానిఫెస్టో ని రూపు కల్పనా చేశారు. తన నవ రత్నాలు పాతకాలకి ఈ మ్యానిఫెస్టో లో పెద్ద పీట వేశారు జగన్. ఎట్టి పరిస్థితులలో మాట తప్పకుండా ఇచ్చిన హామీలన్నీ క్రియాశీలంగా అమలు చేస్తానని జగన్ హామీ ఇచ్చారు…

ఇదే జగన్ మ్యానిఫెస్టో :

నేను విన్నాను.. నేను ఉన్నాను..!

* ప్రతి రైతు కుటుంబానికీ పెట్టుబడి కోసం రూ. 50 వేలు.
* పంట వేసే సమయానికే మే నెలలో రూ. 12,500.
* పంట బీమా కోసం చెల్లించాల్సిన ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది.
* ఉచిత బోర్లు, పగటి పూట 9 గంటల కరెంట్, ఆక్వా రైతులకు యూనిట్ రూ. 1.50కే విద్యుత్.
* రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు.
* పంట వేసే ముందే రేటు, గిట్టుబాటు ధరకు గ్యారంటీ.
* రూ. 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తు నిధి.
* ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగి.
* రెండో ఏడాది నుంచి సహకార రైతుకు పాలు ఇచ్చే పాడి రైతుకు లీటరుకు రూ. 4 బోనస్.
* ప్రమాదమైనా, ఆత్మహత్య అయినా రూ. 7 లక్షల బీమా.
* ఆ డబ్బు అప్పుల వాళ్లకు చెందకుండా అసెంబ్లీలో చట్టం.
* కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలు. పంటకు సంబంధించిన రాయితీలు, ప్రయోజనాలు.
* వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ అమలు.
* అన్ని వర్గాలకూ వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే పథకం అమలు.
* ఎన్ని లక్షలు ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుంది.
* ఏ ప్రాంతంలో చికిత్స చేయించుకున్నా ఉచితమే.
* చికిత్స తరువాత కోలుకునేంత వరకూ కుటుంబానికి సాయం.
* పిల్లల చదువులన్నీ ఉచితం.
* బిడ్డను బడికి పంపే తల్లికి సంవత్సరానికి రూ. 15 వేలు.
* పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు వసతి కోసం విద్యార్థికి ఏటా రూ. 20 వేలు.
* పెన్షన్ల అర్హత వయసు 65 నుంచి 60కి తగ్గింపు.
* వికలాంగులకు, వృద్ధులకు రూ. 3 వేల పెన్షన్.
* ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు.
* స్థలం లేని వారికి ఉచిత స్థలం. మహిళల పేరిట రిజిస్ట్రేషన్.
* ప్రత్యేక హోదా వచ్చేంత వరకూ అలుపెరగని పోరు.
* ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు.
* 50 ఇళ్లకు ఒకరి చొప్పున నెలకు రూ. 5 వేల గౌరవ వేతనంతో వాలంటీర్ల నియామకం.
* అన్ని ప్రభుత్వ పథకాలనూ ఇంటి వద్దకే చేరుస్తాం.
* ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల ఏర్పాటు
* గవర్నమెంట్ కాంట్రాక్టులు నిరుద్యోగ యువతకు ఇచ్చేలా చట్ట సవరణ.
* సబ్సిడీపై యువతకు కావాల్సిన మౌలిక వసతులు.
* వైఎస్ఆర్ ఆసరా ద్వారా మహిళల రుణాలు దశలవారీగా మాఫీ
* మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు.
* మూడు దశల్లో మద్యపాన నిషేధం.
* మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ కు మాత్రమే పరిమితం చేస్తాం.
* అగ్రీ గోల్డ్ బాధితులకు రూ. 1100 కోట్ల కేటాయింపు.
* తిరుమల శ్రీవారి ఆలయం తలుపులను సన్నిధి గొల్లలు తెరిచే సంప్రదాయ పునరుద్ధరణ.
* సొంత ఆటో, టాక్సీ నడిపేవారికి సంవత్సరానికి రూ. 10 వేలు.
* 18 నుంచి 60 ఏళ్ల వయసువారికి రూ. లక్ష బీమా
* సహజమరణమైనా కుటుంబానికి ఆ డబ్బు చెల్లిస్తాం.
* ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు పారదర్శకంగా ఉండేలా చూస్తాం.
* ఎస్సీ, ఎస్టీ కాలనీలు, గిరిజన తాండాల్లో ఏడాదికి 2 వేల యూనిట్ల ఉచిత కరెంట్ లేదా రూ. 6 వేలు.
* ప్రతి ఐటీడీఏ పరిధిలో ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
* గిరిజనులకు వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన అన్ని హామీల అమలు.
* మాతృభాష పరిరక్షణకై విద్యార్థులకు తెలుగు తప్పనిసరి.
* జర్నలిస్టులకు వారి ప్రాంతాల్లోనే ఇంటి స్థలాలు.
* అర్చకుల పదవీ విరమణ నిబంధన రద్దు.
* అర్చకులకు ఇళ్ల స్థలాల కేటాయింపు.
* దేవాలయాల్లో ధూప, దీప నైవేద్యాల కోసం నిధులు.
* దేవాలయాలకు పంచాయతీ జనాభా ప్రకారం రూ. 10 వేల నుంచి రూ. 35 వేలు.
* మైనారిటీల ఆస్తులను సర్వే చేయించి డిజిటలైజేషన్.
* ప్రభుత్వ ఉద్యోగుల ఇబ్బందులు తొలగించేందుకు కృషి.
* సీపీఎస్ ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ.
* ఉద్యోగులు కోరుకున్న విధంగా 26 శాతం ఐఆర్, సకాలంలో పీఆర్సీ అమలు.
* అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్.
* సీనియారిటీ, అర్హతలను బట్టి రెగ్యులరైజేషన్.
* పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు.
* ఉద్యోగులు నిర్భయంగా పనిచేసుకునే స్నేహపూర్వక వాతావరణం.
* అంగన్ వాడీ, ఆశా వర్కర్లకు తెలంగాణ ఇస్తున్న వేతనం కన్నా రూ. 1000 అదనంగా జీతం.
* ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలం లేకుంటే, వారి ప్రాంతంలో ఇళ్ల స్థలం.
* పరిశ్రమల కోసం మరిన్ని ప్రోత్సాహకాలు.
* నిరుద్యోగ యువకులకు సబ్సిడీ ఇచ్చి పరిశ్రమలు పెట్టిస్తాం.

Share.

Comments are closed.

%d bloggers like this: