భర్త అత్త మామ వేధించారు..! ప్రాణం పోయింది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పెళ్లయ్యి ఆర్నెల్లు అయ్యింది అత్త మామ వేధింపులు మొదలు పెట్టారు.. భర్త కూడా వారి పట్టానే చెరీ వేధించడం మొదలు పెట్టాడు. తల్లి దండ్రుల సలహా మేరకు ఆమెకి విడాకుల నోటీసులు కూడా ఇచ్చాడు.. భర్త విడాకుల నోటీసు ఇవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరబాద్ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. నిజాంపేటకు చెందిన చిప్పడ పాండురంగాచార్య కుమార్తె మేఘన హైదర్‌నగర్‌కు చెందిన కొత్తపల్లి వినయ్ లు గత ఏడాది వివాహం చేసుకున్నారు. ఇద్దరు మంచి కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారుమ మేఘన(30) హైదరబాద్ టీసీఎస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంది. పెళ్లయిన ఆర్నెల్లు కాపురం సాఫీగానే సాగింది. అంతా బాగానే ఉంది.. మరి ఏం అయ్యిందో ఏమో వినయ్ ఆమెని వేధించడం మొదలు పెట్టాడు. ఆ గొడవలు కాస్త పెద్దవిగా మారాయి.. కేవలం భార్టే కాకుండా అత్త మామలు కూడా మేఘన పై తిరగబడి ఆమెని వేధించడం మొదలుపెట్టారు.

వేధించడమే కాకుండా ఆమెని విడాకులు ఇవ్వమంటూ వేధించడం ప్రారంభించారు.. ఇక ఈ వేధింపులు తాళలేక మేఘనా తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయి కొన్ని నెలలుగా అక్కడే ఉంటుంది.. భర్త మారుతాదేమో అనే నమ్మకం తో అలా జీవిస్తుంది. కానీ ఆ భర్త విడాకుల నోటీసులని ఆమె ఇంటికి పంపాడు.. విడాకుల పత్రాలు చూడగానే ఆమె మనసు విరిగిపోయి మనస్తాపానికి గురయ్యింది. ఇక మర్నాడు ఆఫీసుకి వెళుతున్నా అని తండ్రితో చెప్పి నేరుగా భర్త ఇంటికి వెళ్లింది..

ఇది గమనించిన వినయ్ తండ్రి ఆమెని చి కొడుతూ ఆపార్ట్మెంట్ కింద అందరిముందు సెక్యూరిటీ ని పిలిచి లోపలికి అనుమతించొద్దు అంటూ అవమానించాడు.. సెక్యూరిటీ గార్డ్ తనని ఆపార్ట్మెంట్ లోనికి రాకుండా అడ్డగించాడు. ఇక అదే అపార్ట్మెంట్ లో వేరే బందువు ఉండటం తో వారికి ఫోన్ చేసి సెక్యూరిటీ తో మాట్లాడించి లోపలికి ప్రవేశించింది. ఇక అప్ప్తికే మనస్తాపంతో ఉన్న మేఘనా ఈ అవమానం రెండు తట్టుకోలేక బంధువు ఇంటికి వెళ్లకుండా నేరుగా అపార్ట్మెంట్ మీదకి వెళ్ళి అక్కడ నుండి దూకెసింది. 30 ఏళ్ళు కూడా నిండని మేఘనా అక్కడికక్కడే మృతి చెందింది. రంగం లోని దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: