చినల్లుడితో బాలయ్య..! పంచ కట్టు..పంచ్ డైలాగ్స్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినీ నటుడు బాలకృష్ణ చిన్న అల్లుడు గీతం విద్యాసంస్థల అధినేత శ్రీ భరత్ జరగనున్న ఎన్నికల్లో విశాఖ నుండి టీడీపీ తరఫున ఎంపీగా బరిలోకి దిగుతున్నారు. ఈ సంధార్బంగా ఆయన ఇప్పటికే ప్రచారం పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రచారం లో జోరుగా ముందుకెళుతున్నారు. ఎన్నికలు దేగ్గర పడుతున్నాయి.. సమయం కూడా ఎక్కువగా లేదు. ఉగాది సందర్భంగా విశాఖకి వచ్చిన బాలకృష్ణ తన చిన్నల్లుడి తరఫున ప్రచారం లో పాల్పంచుకున్నారు.. తెలుగుదనం ఉట్టిపడే రీతిలో పంచకట్టుతో బాలయ్య ఆకర్షణగా నిలిచారు.

చిన్నల్లుడి కోసం ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు.. సినిమా డైలాగ్స్ తో ప్రజలని ఆకర్షించారు. గత అయిదేళ్లుగా టీడీపీ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. టీడీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పాతకాలని ప్రజలకి వివరించారు. పసుపు కుంకుమ బాబు భరోసా ఫించన్లు ఇలా చంద్రబాబు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని ప్రజలకి తెలియజేశారు. రానున్న రోజుల్లో విశాఖా జిల్లాకి భారీ ఎత్తున ఐటీ రాబోతుందని విశాఖా ఐటీ హబ్ గా మారాబోతుందని ఆయన అన్నారు. తన అల్లుడు భరత్ ని భారీ మెజారిటీ తో గెలిపించాలని ప్రజలని కోరారు.

balakrishna election campaign for sri bharath

Share.

Comments are closed.

%d bloggers like this: