రేపు ఆధారాలతో మరో ‘వీడియో’ బయటపెడతా..!- శివాజీ

Google+ Pinterest LinkedIn Tumblr +

టీడీపీ నేత సినీ నటుడు శివాజీ మరో సంచలన ప్రకటన చేశారు. మీడియా ముందు బయట పెడతా అని వ్యాఖ్య చేశారు. ఎన్నికల పోలింగ్ కి మరో నాలుగు రోజులు మాత్రమే ఉందని ఈలోగా రాష్ట్రంలో భారీ కుట్ర జరగబోతుందని ఆయన స్పష్టం చేశారు. నాలుగు రోజులు మాత్రమే ఉన్న ప్రతిపక్షాలు ప్రధాని కలిసి కుట్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కుట్రలు జరగబోతునట్టు ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని దానికి తగిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు.

నాలుగు రోజుల్లో ఏం కుట్రలు జరగబోతున్నాయో తన దేగ్గర పక్క ఆధారాలు ఉన్నాయని వాటిని ఆదివారం ఉదయం మెడియ ముందు బయట పెడతానని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికే గతంలో శివాజీ ఆపరేష్ గరుడ అని ఒక వీడియో సామాజిక మాద్యమాల్లో పెట్టి హల్చల్ చేశాడు ఆ వీడియో చాలా వైరల్ అయ్యింది ఆయన రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో అనే దాని పై తనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జోస్యం చెప్పాడు.. ఇక రేపు మళ్ళీ ఒక వీడియో పెడతానని అందరినీ ఉత్కంఠకి గురిచేశాడు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పదవి నుంచి తప్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్ ను మార్చడం కంటే దారుణం ఏముంటుందని ప్రశ్నించారు. ఇది కచ్చితంగా మోదీ కుట్రేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమీషన్ ప్రధాని నరేంద్రమోదీ చేతిలో కీలుబొమ్మగా మారిందని హీరో శివాజీ ఆరోపించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: