వైద్యుల నిర్లక్ష్యం: రాజధానిలో రోడ్డుపైనే మహిళ ప్రసవం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఓ నిరుపేద మహిళ నడిరోడ్డుపై ప్రసవించిన ఘటన హైదరాబాద్ లోని ఎల్బీనగర్‌లో చోటుచేసుకుంది. సమీప ఆసుపత్రిలో రక్త పరీక్ష అందుబాటులో లేకపోవడం, అందుకోసం మరో హాస్పిటల్‌కి ఆమెను తీసుకెళ్లడంతో ఆ మహిళ మార్గమధ్యలోనే బిడ్డని ప్రసవించింది. ప్రసవ సమయాల్లో నిరుపేద మహిళలు ఎదుర్కొనే అగ్ని పరీక్షలకు ఈ పరిస్థితి అద్దం పడుతోంది. వివరాల్లోకి వెళితే…

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారమతిపేటకు చెందిన చిన్నపన్ను మేరమ్మ మొదటి కాన్పులో మగబిడ్టకు జన్మనివ్వగా… రెండవ సంతానం వైద్య పరిక్షలు ప్రతినెల వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో చేయించుకుంటుంది. కాగ మేరమ్మకు పురిటి నొప్పులు వస్తున్నాయని వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి శనివారం రాగ ఆసుపత్రి సిబ్బంది పండుగ కావడంతో వైద్యులు ఎవరు లేరని కోటి ఆసుపత్రికి వెళ్లమని సూచించారు.
గత్యంతరం లేక మేరమ్మ భర్త రాంబాబుతో కలిసి కోటి ఆసుపత్రికి వెళ్తుండగా మార్గమద్యంలోని ఎల్ బి నగర్ ఫ్లైవర్ సమీపంలో మధ్యాహ్నం సుమారు 1.20 సమయంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే స్థానికులు 108 అంబులెన్సులో తల్లిబిడ్డను వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించడంతో ఆసుపత్రి సిబ్బంది తల్లిబిడ్డలను ఆడ్మిట్ చేసుకున్నారు. ఈ సందర్బంగా మేరమ్మ భర్త రాంబాబు మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం పేదలకు కార్పోరేట్ స్థాయిలో మైరుగైన వైద్యం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంటే డాక్టర్ల నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకవస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భౌవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా ఉన్నతాధికారులు తగు చర్యలు తీసువాలనీ కోరారు.

Share.

Comments are closed.

%d bloggers like this: