కేసీఆర్ కక్ష..! మోదీ కుట్ర..! జగన్ రౌడీ రాజకీయం..!- శివాజీ

Google+ Pinterest LinkedIn Tumblr +

రాజమండ్రి లో టీడీపీ నేత సినీ నటుడు శివాజీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో ఆయన కేసీఆర్ మోదీ లపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ పై ఆరోపణలు చేస్తూ మోదీ పై విమర్శలు చేశారు. కేసీఆర్ ఆంధ్రలో విచ్చలవిడిగా డబ్బు పంచుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలకి డబ్బు కావాలో రాష్ట్రం అభివృద్ధి కావాలో నిర్ణయించుకోవాలని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఏపి పై కక్ష కట్టడం సమంజసం కాదు.. విచ్చలవిడిగా పక్క రాష్ట్రాల నుంచి వచ్చి కొందరు డబ్బులు ఖర్చు చేస్తున్నారు. కేసీఆర్ పంచే డబ్బులే ముఖ్యమనుకుంటే అమరావతి ని, పోలవరాన్ని ప్రజలు కోల్పోతారు అని ఆయన అన్నారు.

మచిలీ పట్టణం పోర్టు కోసం కేసీఆర్ ఏపీలో కుట్రలు చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. అమరావతి, పోలవరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తూర్పుగోదావరి జిల్లా వాసులపై ఉంది. ఓట్లు కోసం డబ్బులు అడుగుతున్న పరిస్థితి చాలా దారుణం. మందు ఏరులై పారుతుంది. మంచి, చెడు ఆలోచించి ధర్మానికి ఓటు వేయండి అని ఆయన ప్రజలని కోరారు.

ఇక ప్రధాని మోదీ పై బీజేపీ పార్టీ పై ఆయన విమర్శలు చేశారు, ఆయన మాట్లాడుతూ.. ప్రాంతీయ పార్టీలను బీజేపీలో కలుపుకునేందుకు మోదీ కుట్రలు చేస్తున్నారు. మోదీ హాయాంలో ఆర్థిక నేరగాళ్లు విదేశాలకు పారిపోయారు. శాశ్వత ప్రదానిగా మారేందుకు మోదీ కుతంత్రాలు చేస్తున్నాడు అని ఆయన మోదీ పై మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో 150 మంది క్రిమినల్స్ పోటీలో ఉన్నారు. రౌడీ రాజ్యం కావాలా..? ఓటర్లు ఆలోచించుకోండి…! అని ఆయన అన్నారు. జగన్ వస్తే మహిళలకు భద్రత ఉండదు. అమరావతిని తరలించనన్న విషయం జగన్ చెప్పడం లేదు అన్నీ ఆలోచించి ఓటు వేయండి అని ఆయన ప్రజలని కోరారు.

Share.

Comments are closed.

%d bloggers like this: