ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా వర్మ..! వైరల్ అవుతున్న వర్మ ఫాస్ట్ లుక్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో మంచి కలెక్షన్స్ అందుకున్న రామ్ గోపాల్ వర్మ మరో బయోపిక్ తీస్తున్నారు..! అది ఓ క్రిమినల్ బయోపిక్ ‘కొబ్రా’.. అనే టైటిల్ ని ఖరారు చేశారు. అయితే ఈ సినిమాకి స్పెషాలిటీ ఏంటంటే ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇన్నాళ్ళు తెర వెనకు దర్శకత్వం చేసే వర్మ ఈసారి తెర పై లీడ్ రోల్ లో  కనిపించబోతున్నారు. నిన్న ఆయన పూతిన రోజుగా ఆయన ఈ ఫోటో విడుదల చేశారు.

ఇప్పటి వరకు వార్మ మనకి మంచి దర్శకుడిగా నిర్మాతగా కనిపించాడు అప్పుడప్పుడు వర్మ సినిమా లో పాటలు కూడా పాడుతాడు. కానీ తెర పై ఎప్పుడూ లీడ్ రోల్ లో కనిపించలేదు. ఇక ఈ సారి వర్మ కనిపించనున్నాడు. వర్మ తెరకెక్కిస్తున్న కొబ్రా అనే బైఓపిక్ లో ఆయన ఇంటెలిజెన్స్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఓ క్రిమినిల్ పట్టుకోవటానికి ఓ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ చేసే ప్రయత్నాలు…చివరకి ఎలా తుద ముట్టించాడనేది చూపబోతున్నట్లు సమాచారం. మరో విషయం ఏమిటంటే  ఇందులో సీయం కేసీఆర్‌ పాత్ర కూడా ఉండటం విశేషం. వర్మతో పాటు ఆగస్త్య మంజు దర్శకత్వం వహించనున్నారు. కీరవాణి స్వరకర్త. ఇక వర్మ తెర పై కనిపిస్తున్నారంటే ఆయన ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు.

వర్మ వైరల్ కథలు తెరకెక్కిస్తుంటాడు. సినిమా కథలో ఏదో ఒక వైరల్ కంటెంట్ ఉంటే తప్ప ఆయన సినిమా చేయడు. ఆయనకి వచ్చే తాట్స్ కూడా అలాగే ఉంటాయి. అయితే కొబ్రా సినిమా లో సీఎం కేసీఆర్ పాత్ర ఉందట..! సీఎం కేసీఆర్, ఓ క్రిమినల్, ఓ క్రిమినల్ ని సీఎం కేసీఆర్ ఆదేశాల మీద తుది ముట్టించిన ఓ అధికారి ఇది సినిమా సబ్జెక్ట్..! ఇక కొబ్రా బ్యానర్ పై చూస్తే.. ఈ ఒక్క క్రిమినల్ ని పట్టుకొనుంటే సగం పోలీసులు జైల్లో ఉండేవాళ్లు అని ఉంది. సినిమా సబ్జెక్ట్ సినిమా బ్యానర్ ని చూస్తుంటే ఎక్కడో వినట్టుగా ఏడూ సింక అవుతుంది కదా..? ఆ క్రిమినల్ ఎవరో మీకు ఇప్పటికే అర్ధం అయ్యినట్టు ఉంది..! ఇక ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పైకి వెళ్లింది. మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: