తూర్పు గోదావరి అమలాపురం జిల్లాలో నేడు నిర్వహించిన జనసేన ప్రచార సభ కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు పై వైసీపీ అధినేత జగన్ పై దుయ్యబడ్డారు. ఇద్దరి పై విమర్శలు చేస్తూ తాను ప్రసంగించారు. చంద్రబాబు కుటుంబం వైఎస్ కుటుంబం రాజకీయాల్లో ఏళ్ల తరబడి పాతుకుపోయాయని జనాలు కొత్తగా వచ్చిన పార్టీలకి తోడుగా ఉంటారని ఆయన పేర్కొన్నారు.
ఆయన మాట్లాడుతూ.. ఒకరేమో మామని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యారు మరొకరు తండ్రి రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు పార్టీ పెట్టారు కానీ జనసేన ఒక్కటే ఏ ఒక్కరినీ అడ్డం పెట్టుకొని ఏ ఒక్కరి మద్దత్తు లేకుండా ఒంటరిగా రాజకీయాల్లోకి వచ్చిందని ఆయన తెలియజేశారు. తాను కాపులకే ప్రాధాన్యత ఇస్తానని టీడీపీ నేతలు విమర్శించారనీ, అది నిజం కాదని పవన్ అన్నారు. అన్నీ కులాలకి అండగా నిలబడదామని కుల మతాలకి అతీతంగా జనసేన స్థాపించామని పవన్ వ్యాఖ్యానించారు. కులమతాలకు ప్రాంతాలకు అతీతంగా జనసేన పనిచేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
‘తనకు దళితుల మీద ప్రేమ ఉందని జగన్ చెబుతారు. వెనుకబడిన కులాల గురించి మాట్లాడతారు. కానీ ఒక్కసారి పులివెందుల వెళ్లి చూడండి. దళితులను ఎంతగా ఇబ్బంది పెడతారో. వాళ్ల ఇంటి ముందు దళితులు చెప్పులు విప్పి వెళ్లాలంట. ఆయనేమో ఇక్కడికొచ్చి దళితుల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారు’ అని మండిపడ్డారు. కులాలని అడ్డుపెట్టుకొని జనసేన రాజకీయం చేయదని.. అన్నీ కులాల అభివృద్దే జనసేన లక్ష్యం అని పవన్ స్పష్టం చేశారు.