విజయ్ మాల్య రాక తప్పదు గాక..! బ్రిటన్ హైకోర్ట్ ‘తీర్పు’..!

Google+ Pinterest LinkedIn Tumblr +

భారత బ్యాంకులకి కన్నం పెట్టి బ్రిటన్ కి చెక్కేసిన ఆర్థిక నేరగాళ్ళు విజయ్ మాల్య నీరవ్ మోదీ.. విజయ్ మాల్య ఎస్‌బి‌ఐ బ్యాంక్ వద్ద 9000 కోట్లకి పైగా రుణాలు తీసుకొని బ్రిటన్ కి పరారవ్వగా నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వద్ద భారీ రుణాలు తీసుకొని బ్రియాతన్ పరారయ్యారు..! అదేం విడ్డూరమో ఇద్దరు ఒక సమయం లో ఒకే రీతిలో రుణాలు తీసుకొని ఒకే దేశానికి పరారయ్యారు.. అక్కడికెళ్లి దర్జాగా జీవితం కొనసాగిస్తున్నారు.. ఎంతటి నేరగాడైనా ఏదో ఒక రోజు చట్టం చేతికి చిక్కక తప్పదు. ఇక ఇద్దరూ మళ్ళీ ఒకే కాలంలో బ్రిటన్ పోలీసులకి పట్టుబడ్డారు.

విజయ్ మాల్య ని అరెస్ట్ చేసిన బ్రిటన్ పోలీసులు..ఆయనని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్ట్ ఎదుట ప్రవేశపెట్టింది. ఇక ఆక్కడ విజయ్ మాల్యా భారత న్యాయస్థానాలకు జవాబుదారీగా ఉండాలని సూచించింది. అతను చేసిన ఆర్థిక అవకతవకలకు భారతీయ న్యాయస్థానాల పరిధిలోనే విచారణ కొనసాగాలని సూచించింది. ఇక ఆయన మళ్ళీ తనను భారత్‌కు అప్పగించే చర్యలను అడ్డుకోవాలని బ్రిటన్ హైకోర్టు లో పిటీషన్‌ను దాఖలు చేయగా.. బ్రిటన్ హైకోర్ట్ ఆ పిటిషన్ ని తీసివేసింది. వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హై కోర్టును ఈ నిర్ణయం తీసుకుంది. అంతే కాదు చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా అర్బుత్‌నాట్ వ్యాఖ్యానిస్తూ…విజయ్ మాల్యా భారత న్యాయస్థానాలకు జవాబుదారీగా ఉండాలని సూచించింది. అతను చేసిన ఆర్థిక అవకతవకలకు భారతీయ న్యాయస్థానాల పరిధిలోనే విచారణ కొనసాగాలని సూచించింది. దీంతో ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమం అవుతోంది అనే చెప్పాలి. ఇక త్వరలో విజయ్ మాల్య స్వదేశానికి రాక తప్పదు అని అర్ధం అవుతుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: