టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.. ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ పై ఫైర్ అయ్యారు. జీవీఎల్ పై సీఎం రమేశ్ ధీటు వ్యాఖ్యలు చేశారు. గీవీఎల్ ఒక జోకర్ అని బ్రోకర్ అని ఆయన వ్యాఖ్యానించారు. జీవీఎల్ కి ప్రజా శాంతి అధినేత కెఏ పాల్ కి ఎటువంటి తేడా లేదని ఆయన వ్యంగ్యంగా విమర్శలు చేశాడు. జీవీఎల్ నోరు తెరుస్తే అబద్ధాలు అని ఆయన అన్నారు. అబద్ధాలు చెప్పడం లో జీవీఎల్ ఒక ఎక్స్పర్ట్ అని ఆయనకి మించిన వారు ఉండరని రమేశ్ విమర్శించారు. ఏపీ లో బీజేపీ కి ఒక్క సీటైనా వస్తుందా..? ఒక్క దేగ్గర అయినా డిపాజిట్లు కొడుతుందా అని ప్రశ్నించారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఉండదని జీవీఎల్ వైసీపీ కండువా కప్పుకోక తప్పదని ఆయన అన్నారు.
జీవీఎల్ ఒక జోకర్..! ఒక బ్రోకర్..!- సీఎం రమేష్.
Share.