మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకి గురయిన విషయం తెలిసిందే ఈ కేసు పై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కేసులో సాక్ష్యాలు తారుమారయ్యాయని హత్య ఒకలాగా జరిగితే ఇంకోలాగ కథ తెరకెక్కించారని అనేక ఆరోపణలు అనుమానాలు వచ్చాయి. ఈ కేసుని సీట్ బృందం విచారిస్తుంది. కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మా పర్యవేక్షణలో ఈ కేసుని విచారణ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ కేసులో 65 మందికి పైగా విచారణ చేశారు అందులో ప్రదాన నిందితులుగా వివేకా అనుచరుడు గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, వంట మనిషి కొడుకు ప్రకాష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురి వాంగ్మూలాన్ని పోలీసులు కోర్టుకి సమర్పించారు. కోర్టులో వీరీ వాంగ్మూలాలతో పాటు వీరిని కూడా కోర్టు ముందు హాజరుపరచారు. పోలీసుల విచారణలో భాగంగా విరిచ్చిన సమాచారం మేరకు..
1) వివేకానందరెడ్డి ముఖ్య అనుచరుడిగా ఆయనను తరచూ కలుస్తుంటానని గంగిరెడ్డి విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. గత నెల 15 వ తేదీ ఉదయం 7 గంటలకు వివేకానందరెడ్డి బావమరిది తనకు ఫోన్ చేసి వివేకానందరెడ్డి చనిపోయారని చెప్పారని సిట్ బృందానికి వివరించినట్టుగా సమాచారం. తాను వివేకా ఇంటికి వెళ్లగానే ఆయన ఇంటి వద్ద జనం ఉన్నారని ఆయన గుర్తు చేసుకొన్నారు. బెడ్రూమ్లో వివేకానందరెడ్డి రక్తపు మడుగులో పడి ఉన్నారని గంగిరెడ్డి పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది.
2) 15వ తేదీ ఉదయం ఐదున్నర గంటలకు తాను వివేకా ఇంటికి వెళ్లినట్టుగా పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు. ఆ తర్వాత సౌభాగ్యమ్మకు ఫోన్ చేసి వివేకా లేవలేదని చెప్పినట్టుగా వివరించారు.
3) వంట మనిషి లక్ష్మీదేవి ఆమె కొడుకు ప్రకాష్‌లు వచ్చిన తర్వాత ఎన్ని సార్లు పిలిచినా ఆయన పలకకపోవడంతో వాచ్మెన్ రంగన్న సైడ్ డోర్ తీసి చూస్తే వివేకానందరెడ్డి రక్తపు మడుగులో పడి ఉన్నాడని పోలీసులకు చెప్పారు. సోఫా వద్ద వివేకానందరెడ్డి చేతి రాతతో ఉన్న లెటర్‌ను తీసుకొని వివేకా కూతురు , అల్లుడికి ఇచ్చినట్టుగా ఆయన చెప్పారు. ఇంత కంటే తనకు ఏ విషయాలు తెలియవన్నారు.