బాలీవుడ్ అర్జున్ రెడ్డి కి టాలీవుడ్ అర్జున్ రెడ్డి ట్వీట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అర్జున్ రెడ్డి సినిమాతో మంచి హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ తన కరియర్ లో మంచి ఊపు మీద ఉన్నాడు. ఒక పక్క తన సినిమాని అటు తమిళంలో ఇటు హింది లో రెండిటిలో తెరకెక్కిస్తున్నారు. తమిళంలో స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ ఈ సినిమా లో వర్మ గా వెండితెరకి పరిచయం అవుతున్నారు ఇక హిందీలో నటుడు షాహిద్ కపూర్ కబీర్ సింగ్ గా కంపించబోతున్నాడు. ఈ సినిమాకి తెలుగు లో ఏ స్థాయి హిట్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సందీప్ రెడ్డి దర్శకత్వం విజయ్ దేవరకొండ నటన ఈ సినిమా కి ఇంత ఘనత ని దక్కించాయి. ఇక ఈ సినిమా తో విజయ్ దేవరకొండ కి వరుస అవకాశాలు దక్కుతున్నాయి త్వరలో డియర్ కామ్రేడ్ సినిమాతో మూడు రాష్ట్రాల్లో విజయ్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

ఇక ఈ విషయం ఇలా ఉంటే అర్జున్ రెడ్డి సినిమా ని తమిళంలో బాలా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక హిందీలో సందీప్ రెడ్డి వంగానే దర్శకత్వం వహిస్తున్నారు. ఇక అటు తమిళం ట్రైలర్ కొన్ని రోజుల క్లృతమ్ రిలీజ్ అయ్యింది అక్కడ కూడా ఆ తరిలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక ఇదే రీతిలో సోమవారం కబీర్ సింగ్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అక్కడ కూడా ట్రైలర్ కి మంచి క్రేజ్ దక్కుతుంది. యూట్యూబ్ లోనే కాకుండా నిన్న ట్విట్టర్ లోనూ ప్రపంచ వ్యాప్త ట్రెండ్స్ లో కబీర్ సింగ్ చోటు దక్కించుకోడం గమనార్హం.

ఈ ట్రైలర్ చూసిన విజయ్ దేవరకొండ అమేజ్ అయ్యాడు. మరోసారి అర్జున్ రెడ్డి అనే పాత్రని తెర పై చూస్తునట్టు అనిపిస్తుంది అని ఆయన రియాక్ట్ అయ్యారు. బాలీవుడ్ అర్జున్ రెడ్డి.. మన టాలీవుడ్ అర్జున్ రెడ్డికి తెగ నచ్చేశాడట. ‘కబీర్ సింగ్’ టీజర్ అదిరిపోయింది అంటూ చిత్ర యూనిట్‌కి విషెష్ అందించారు విజయ్ దేవరకొండ. ‘కబీర్ సింగ్’.. నా బెస్ట్ విషెష్ అందిస్తున్నా అంటూ దర్శకుడు సందీప్, షాహిద్ కపూర్, కియారా అద్వానీలకు శుభాకాంక్షలు తెలియజేశారు విజయ్ దేవకొండ.

Share.

Comments are closed.

%d bloggers like this: