ఈసీ కార్యాలయం ఎదుట దార్నాకి దిగనున్న బాబు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అధికారుల బదిలీ ఐటీ దాడులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. అధికారులని బదిలీ చేసి తమ పార్టీ నేతలపై ఐటీ దాడులు జరిపి తమ ఆత్మ స్థైర్యాన్ని ఈసీ దెబ్బతీస్తుందని ఆయన ఈసీ తీరుని తప్పుబట్టారు. ఎన్నికల కోడ్ అమలు లోకి వచ్చిన తరువాత ఎన్నికల సంఘం వ్యవహారాన్ని ఆయన తప్పుబట్టారు.. ఎన్నికల సంఘం వైసీపీ బీజేపీ లు చెప్పినట్టుగా నడుచుకుంటుందని ఆయన ఆరోపించారు. టీడీపీ ఫిర్యాదులను ఈసీ పట్టించుకోలేదని ఆయన వివరించారు. జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ ఆయన స్వయానా ఈసీ సీఈ‌ఓ కి వినతి పత్రం అందజేస్తారు.

అధికారుల బదిలీ, ఐటీ దాడులపై తాము ఎన్నిసార్లు విన్నవించినా ఈసీ స్పందించడం లేదని పార్టీ నేతలు, మంత్రుల ఎదుట ఆరోపించిన చంద్రబాబు, సీఈఓకు స్వయంగా వినతి పత్రం ఇవ్వనున్నట్టు తెలిపారు. వినిటీ పత్రం అందజేసిన తరువాత.. ఈసీ వైఖరిపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఈసీ కార్యాలయం ఎదుట దార్నాకి దిగుతామని పిలుపునిచ్చారు. ఆయన పిలుపు కి టీడీపీ శ్రేణులు మద్దత్తు తెలుపుతున్నాయి. ఏపీ రాష్ట్రానికి పోలీసు పరిశీలకుడుగా వచ్చిన కె.కె.శర్మను వెంటనే బదిలీ చేయాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఇక మంగళవారం రాత్రి ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్‌ను బదిలీ చేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం పై ఆయన వివరణ కోరుతున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: