సైరా టీమ్ కి చరణ్ స్వీట్ వార్నింగ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి తన 150 వ చిత్రంగా ఖైదీ నంబర్ 150 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి అద్భుతమైన హిట్ సంపాదించాడు. ఇక ఆ సినిమా తరువాతా చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు త్వరలో సైరా తో మన ముందుకి రాబోతున్నాడు. భారీ అంచనాలతో బారి బడ్జెట్ తో మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత బడ్జెట్ గా 200 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాని తన కొడుకు రామ్ చరణ్ కొణిదెల బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. అద్భుతమైన గ్రాఫిక్స్ తో మంచి కథ తో సినిమాని మన ముందుకి తీసుకొస్తున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి.

అయితే ఈ సినిమా షూటింగ్ కే చాలా రోజులు పట్టింది. దీంతో మెగా అభిమానులంతా సినిమా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అభిమానులకి చిత్రా యూనిట్ ప్రతీసారి గ్రాఫిక్స్ పనుల వల్ల ఆలస్యం అవుతోందని చెబుతూ వస్తుంది. ఇక విషయాన్ని చరణ్ సీరియస్ గా తీసుకున్నాడు. దసరా టైమ్ కి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. పనులు వేగవంతం చేయాలని జాప్యాన్ని వీడాలని చరణ్ చిత్రా యూనిట్ తో గట్టిగా చెప్పినట్టు సమాచారం. చరణ్ అందరికి క్లాస్ పీకినట్లు ఇన్ సైడ్ టాక్. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలనీ స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: