ఏపీ వోటర్ల, పోలింగ్ కేంద్రాల సంఖ్య..! ఎన్నికల అప్డేట్స్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశ వ్యాప్తంగా ఎన్నికలు దేగ్గరపడుతున్నాయి.. మొత్తం 7 విడతల్లో పోలింగ్ ని నిర్వహిస్తున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో మొదటి విడతలో పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు 25 ఎంపీ స్తానాలు ఉన్నాయి. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 2,118 అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. ఇక 25 ఎంపీ స్థానాలకు గాను 319 మంది పోటీ లో ఉన్నారు. ఇక తెలుగు ప్రజలు రేపు తమ హక్కుని వినియోగించుకొని అభ్యర్థులను ప్రభుత్వాలను నిర్ణయించనున్నారు.

రేపటి పోలింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. పోలింగ్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల సీసీ టీవీ కేమరాలు అమర్చారు. అవసరమైన సిబ్బంది కాంటే 20 శాతం అదనంగా అధికారులకు విధులు సమర్పించారు. ఎక్కడ గొడవలు కాకుండా గందరగోళం ఏర్పడకుండా ఉండటానికి అన్నీ విదాలా సర్దుబాట్లు చేస్తున్నారు.

పోలింగ్ సిబ్బంది ఇప్పటికే తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు చేరుకొన్నారు. ఏపీ రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి నాటికి ఏపీ జనాభా 5,30,01,971. అందులో మొత్తం ఓటర్ల సంఖ్య 3,93,45,717గా నమోదైంది. అయితే ఇందులో పురుషులు 1,94,62,339, స్త్రీ ఓటర్లు 1,98,79,421, ట్రాన్స్‌జెండర్లు3967 మంది కూడ తమ ఓటు హక్కును నమోదు చేసుకొన్నారు. కాగా వీరందరూ తమ ఓటు వినియోగించుకోడాని 45,920 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: