3 ఏళ్ల చిన్నారి పై కామందుడి అఘాయిత్యం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హైదరబాద్ లో దారుణం చోటు చేసుకుంది. మూడేళ్ళ చిన్నారి పై ఒక కామాందుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన బాలిక తల్లి అమ్మమ్మ పోలీసులకి ఫిర్యాదు చేయగా అతనిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన పటాన్‌‌చెరు సమీపంలోని అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. హైదరబాద్ లో చిన్నారులపై లైంగిక దాడులు ఎక్కువయ్యాయి దీని పై ప్రభుత్వం ఏదో ఒక కట్టుదిట్టమైన చర్య చేపట్టాలి.

వివరాల్లోకి వెళితే.. పటాన్‌‌చెరు సమీపంలోని అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్ గ్రామంలో అమ్మమ్మ, తల్లి, ఆమె మూడేళ్ల కూతురు నివాసం ఉంటున్నారు. బాలిక తాత చనిపోగా… తండ్రి ఉద్యోగం నిమిత్తం విదేశాల్లో సెటిల్ అయ్యాడు. దాంతో తల్లితో కలిసి బిడ్డను చూసుకుంటూ జీవనం సాగిస్తోంది ఆ మహిళా. అయితే గ్రామంలోని గండిగూడ కాలనీకి చెందిన అభయ్‌కుమార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చి నగరంలో సెటిల్ అయ్యాడు. ఇక అభయ్ కుమార్ కూడా వీరి ఇంటి పక్కనే ఉంటున్నాడు.

అయితే కొద్ది రోజులుగా ఆ మహిళా కొంత అనారోగ్యంతో బాధ పడుతుంది. ఇక తల్లిని బిడ్డని ఆ అమ్మమే చూసుకుంటుంది. ఇక అమ్మమ్మ నీళ్ళు తేడానికి మార్కెట్ కి వెళుతూ ఆ మూడేళ్ళ చిన్నారిని పక్కింటి అభయ్ దేగ్గర వదిలేసి వెళ్లింది. ఇక అదే సమయం అదనుగా భావించి ఆ మూడేళ్ళ చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఆ కామాందుడు.

ఇక ఆ చిన్నారికి రక్తస్రావం అవుతుంది దాన్ని తుడిచేసి అమ్మమ్మ వచ్చే సమయానికి ఏమి తెలియానట్టుగా ఆ చిన్నారిని అమ్మమ్మకి ఇచ్చేశాడు. పైగా కొంత సేపటినుండి బాగా ఏడుస్తుంది అని కట్టు కథలు చెప్పాడు. ఆ చిన్నారి ఎంత సేపటికి ఏడుపు ఆపడం లేదు ఇక ఆ చిన్నారికి రక్తస్రావం కూడా అవ్వడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ డాక్టర్లు పరీక్షించి చెప్పడంతో అమ్మమ్మ తల్లి ఇద్దరు కంగు తిన్నారు. అభయ్ ఇంటికి వెళ్ళి గట్టిగా నిలదీశారు. ముందు తనకి ఏమి తెలియానట్టుగా నటించిన తరువాతా విషయం పెద్దగా అవ్వడంతో ఇద్దరినీ నెట్టేసి అక్కడ నుండి పరారయ్యాడు. ఇక వెంటనే తల్లి బిడ్డలు ఇద్దరు వెళ్ళి ఈ విషయాన్ని గూర్చి పోలీసులకి ఫిర్యాదు చేయగా పోలీసులు రంగం లోకి దిగారు. అతని గురించి గాలించి అతనిని ఎట్టకేలకి పట్టుకున్నారు దేహశుద్ది చేసి అతనిని విచారణ నిమిత్తం రిమాండ్ కి తరలించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: