తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్..! తెలంగాణ ను మించిన ఆంధ్రా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశ వ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా మొదటి విడత పోలింగ్ లో భాగంగా నేడు తెలుగు రాష్ట్రాల్లో మరియు అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌, మణిపూర్‌, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, త్రిపుర, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌‌లో పోలింగ్ జరిగింది. అన్నీ రాష్ట్రాల్లో సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగగా ఆంధ్రప్రదేశ్ లో మరీరియు తెలంగాణ రాష్ట్రం లోని నిజామాబాద్ లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. సమస్యాత్మక ప్రదేశాల్లో సాయంత్రం 4 గంట్లకే పోలింగ్ ముగిసింది.

పోలింగ్ సమయం దాటినప్పటికీ ఇంకా కొన్ని ప్రదేశాల్లో జనాలు బారులు తీసి ఉన్నారు. సాయంత్రం 6 గంటల కల్లా క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని ఎన్నికల అధికారులు చెప్పడంతో సాయంత్రం 6 గంటల కల్లా చాలా మండి జనం వచ్చి క్యులలో నిలుచున్నారు. దీంతో పోలింగ్ శాతం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పోలింగ్ శాతాలు వెల్లడయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో.. ఏపీలో సాయంత్రం 6 గంటల వరకు 65 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు సమాచారం. ఇటు తెలంగాణలో 5 గంటల వరకు 60.57 శాతం నమోదైంది. ఇక మరి కొంత మండి ఓటర్లు క్యూలో ఉండటంతో ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: