ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి.. ఈసారి పోలింగ్ అత్యధికంగా 76 శాతం నమోదయ్యింది. మధ్యరాత్రి వరకు పోలింగ్ జరిగిన దృశ్యాలు మనం చూసాము. అయితే ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఎవరికి అవకాశాలు ఉన్నాయి అని సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.. ఒక పక్క టీడీపీ అధినేత ఈసారి గెలుపు తద్యం అని 130 అసెంబ్లీ సీట్లు తమకే వస్తాయని ఏపీ ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చినట్టే అని ఆయన స్పష్టం చేశారు ఇక వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా తగ్గేది లేదు అన్నట్టు గట్టి పోటీ ఇచ్చి గెలుపు పై ధీమా వ్యక్తం చేశారు.
ఇక పోతే జనసేన పరిస్తితి ఎలా ఉండబోతుంది అని అటు ఆంధ్ర ప్రజలు పవన్ అభిమానులు ప్రశ్నలు లేవదీస్తున్నారు.. ఎన్నికలకి ముందు వచ్చిన సర్వేల్లో మాత్రం జనసేన కి కేవలం 10 కంటే తక్కువ సీట్లే వస్తాయని వెల్లడయ్యింది ఇక పోతే నిన్న పోలింగ్ బాగా జరిగేసరికి ఇప్పుడు ఆ సంఖ్య పై అంచనా వేయడం కొద్దిగా కష్టంగా మారుతుంది ఒకవేల పవన్ 15 సీట్లకి మించి గెలుపొందితే తానే కింగ్ మేకర్ అవుతారు అని కూడా ప్రచారం జరుగుతుంది మొత్తానికి బారిగా పోలింగ్ జరిగేసరికి ఇప్పుడు ఎవరు గెలుపొందుతారు అనే విషయం పై ప్రజలకి విశ్లేషకులకి ఆ విషయం ఒక టాస్క్ లా మారింది అని చెప్పొచ్చు.
రాఃత్రాన్ని పక్కన పెడితే మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్తితి ఏంటి తాను పోటీ చేసిన గాజువాక భీమవరం నుండి ఆయన గెలుపొందుతారా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక పోతే పవన్ కళ్యాణ్ భీమవరం ప్రజలని ఆకర్షించినప్పటికీ గాజువాక ప్రజలని అంతగా ఆకట్టుకోలేకపోయారు. భీమవరంలో ఆయన ప్రచారం చేయగలిగారు కానీ గాజువాక లో సరిగ్గా ప్రచారం చేయలేదు అనే చెప్పాలి. పవన్ ప్రచారపు చివరి రోజుల్లో గాజువాకలో ప్రచారం చేయాలనుకున్నాడు కానీ అప్పుడే ఆయనకి తగిలిన ఎండదెబ్బ ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడం వల్లా ఆయన అక్కడ అనుకున్న రీతిలో ప్రచారం చేయలేకపోయారు. ఒక సభ కూడా రద్దు అవ్వడం అతనికి మైనస్ అయ్యింది. గాజువాక కి మొత్తం 3,09,326 ఓటర్లతో జిల్లాలోనే అతి పెద్ద నియోజకవర్గంగా రికార్డ్ ఉంది. ఇక అలాంటి నియోజకవర్గం లో పవన్ సరిగా ప్రచారం చేయకపోడం గెలుపు పై పలు సందేహాలకి దారి తీస్తుంది.
ఇకపోతే గాజువాకా నుండి పవన్ కి గట్టి పోటీయే ఎదురయ్యింది. గాజువాక నుండి టీడీపీ తరఫున పల్లా శ్రీనివాసరావు నుంచి తీవ్ర పోటీ ఎదురవుతుందని తొలుత ప్రచారం జరిగింది. అనూహ్యంగా వైకాపా అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి బలమైన పోటీనిచ్చారని తెలుస్తోంది. నాగిరెడ్డి గతం లో ఇప్పటికే ఎండు సార్లు పోటీ చేశారు కానీ గెలవలేకపోయారు. 2009 లో స్వతంత్ర అభ్యర్థిగా 2014 లో వైసీపీ తరఫున పోటీ చేశారు కానీ రెండు సార్లు ఆయన గెలుపొందలేకపోయారు. ఇక ఆయన వయసు కూడా పెద్దవారు.. దాంతో నేను మరోసారి పోటీ చేయలేను ఇప్పటికే ప్రతిపక్షం లో నియోజకవర్గానికి బాగా సేవ చేశాను నాకు అవకాశం ఇవ్వండి అంటూ సానుభూతిపరులని పెంచుకున్నాడు అని టాక్.. ఇక టీడీపీ నుండి పల్లా కి మంచి ఓట్ బ్యాంక్ ఉంది.. దీంతో పవన్ కి గట్టి పోటీ ఏ ఉందని ఆలోచించకుండా చెప్పేయొచ్చు.. నియోజకవర్గం లోని పలు గ్రామాలు పవన్ కి మద్దత్తు పలికినప్పటికి త్రిముఖ పోటీ లో విజేత ఎవరన్నది ఎవ్వరికైనా చెప్పడం సాధ్యం కాదు ఇక విజేత ఎవరు అనే విషయం మే 23 న వెల్లడవుతుంది అప్పటి వరకు వేచి చూడాలి..!