ఆంధ్రప్రదేశ్ ఐటీ అధికారి మంగళగిరి నుండి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ నిన్న జరిగిన పోలింగ్ లో ఓటు వేసిన జనానికి అభినందనలు దాన్యవాదాలు తెలియజేశారు. ఏపీ ప్రజలు తెలివైన వారని సరైన అభ్యర్థులనే ఎంచుకున్నారని సరైన అభ్యర్థి పక్షానే నిలిచారని ఆయన అభినందనలు చేశారు. ఓటు హక్కుని వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడిన ప్రతీ ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.. ఆయన తన ట్వీట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేసి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
జరిగిన ఎన్నికలు మంచికి చెడుకి మధ్య జరిగిన యుద్ధం అని ప్రజలు మంచి పక్షాన్నే ఎంచుకున్నారని ఆకరి వరకు మంచి తోనే ఉన్నారని ఆయన తెలియజేశారు. ఎండలు మండుతున్నా.. ఈవీఎం మిషన్లు పని చేయకపోయినా గంటలు తరబడి లైన్ లో నిలబడ్డ ప్రతి ఒక్క మహిళ కి పెద్దలకి యువతకి నా అభినందనలు. మీ అందరికీ దాన్యవాదాలు ఎలా తెలియజేసుకోవాలా మాటలు రావడం లేదని ఆయన వ్యాక్యానించారు. గంటలు తరబడి లైన్ లో నిలుచుని తమ ప్రియతమ నేత నారా చంద్రబాబు వెంట ఉన్నందుకు నా ప్రత్యేక దాన్యవాదాలు అని ఆయన ట్వీట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు.
I am at loss of words to thank women and elderly people enough for braving the heat and failure of EVMs, waiting in queues for long hours to cast their vote and stand by their leader @ncbn whom they admire like their own family member. Hats off to them all!
— Lokesh Nara (@naralokesh) April 12, 2019