ముందు ఎవరు..! మహేశ్ ఆ..? ప్రభాస్ ఆ..?

Google+ Pinterest LinkedIn Tumblr +

కేజీఎఫ్ సినిమా గురించి కొత్తగా చెప్పడానికి ఏమి లేదు.. సినిమా హీరో యష్ కి సినిమా దర్శకుడికి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది హీరో యష్ కి వరుస ఆఫర్లు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆఫీస్ ఎదుట క్యూలు. సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా మంచి బ్లాక్ బస్టర్ గా ఇద్దరి కెరీర్ లలో నిలిచిపోతుంది దాదాపుగా 200 కోట్లకంటే ఎక్కువ వసూలు చేసుకుంది ఈ సినిమా ఇక అప్పటినుండి దర్శకుడి పై మన తెలుగు హీరోల నిర్మాతల కన్ను పడింది. బడా హీరోలు సైతం దర్శకుడు ప్రశాంత్ నీల్ కి ఫోన్ చేసి తమతో సినిమా చేయమని ఆఫర్ ఇస్తున్నారు. నిర్మాతలు అయితే తమ బ్యానర్ పై ఒక సినిమా చేయండి అంటూ ఆయనని సంప్రదింపులు చేస్తున్నారు అని ఫిల్ నగర్ లో టాక్.

నిర్మాతలు దిల్ రాజు యువీ క్రియెషన్స్ ఇప్పటికే ప్రశాంత్ నీల్ తో మాట్లాడారట. ప్రశాంత్ వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. కానీ ఇంత వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక పోతే సూపర్ స్టార్ మహేశ్ బాబు కేజీఎఫ్ సినిమా చూసి స్వయానా ప్రశాంత్ నీల్ కి ఫోన్ చేసి అభినందనలు తెలియజేశాడు ఇక అదే క్రమంలో తనతో సినిమా చేయడానికి ఒక మంచి కథ సిద్దం చేసుకొమ్మని మహేశ్ అడిగారాట. ఇక సూపర్ స్టార్ స్వయానా ఫోన్ చేసి అడిగితే ఏ దర్శకుడు కాదంటాడు.. ఇక అనుకూనట్టే ప్రశాంత్ ఒక మంచి కథని మహేశ్ కొరకు సిద్ధం చేసుకొని మహేశ్ భార్య నమ్రత తో సినిమా కథ ని చెప్పారట. కథ నమ్రత కి ఎంతగానో నచ్చేసింది. కథ గురించి మహేశ్ తో మాట్లాడతానని ఆమె చెప్పినట్టు సమాచారం.

ఇక పోతే బాహుబలి ప్రభాస్ ది కూడా ఇదే పరిస్థితి యువీ క్రియెషన్స్ ప్రశాంత్ నీల్ తో సంప్రదింపులు జరిపిందట. హీరో గా ప్రాభాస్ ని పెట్టి సినిమా చేయాలని ఆయనని కోరిందట. ఇక దేశాన్నే షేక్ చేసిన యాక్షన్ హీరో బాహుబలి ప్రాభాస్ తో సినిమా తీయాలని ఏ దర్శకుడికి ఉండదు.. ఇక ప్రభాస్ గురించి కూడా ఒక మంచి కథ ని సిద్ధం చేసుకునే పనిలో పడ్డాడు ప్రశాంత్ నీల్. సూపర్ స్టార్ తో సినిమా తీస్తే ధానికి ప్రొడ్యూసర్ దిల్రాజు ఉండబోతున్నాడు. ఇక యువీ క్రియెషన్స్ బ్యానర్ పై ప్రభాస్ ఉండబోతున్నాడు. ఇద్దరితో సినిమా తీసే అవకాశం పుష్కలంగా ఉంది కానీ ఎవరితో ముందు సినిమా ఉండబోతుందో అనే విషయం పై ఎటువంటి క్లారిటీ లేదు.. అధికారిక ప్రకటన వస్తే తప్ప క్లారిటీ రాదు. ఇక నిజంగానే కేజీఎఫ్ డైరెక్టర్ తో సినిమా తీస్తే మహేహ్ ప్రభాస్ అభిమానులకి పండగే ఉండబోతుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: