RRR లో యంగ్ రెబెల్ స్టార్..! కథ నెక్స్ట్ లెవెల్ కి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇద్దరు ఉద్యమకారులు స్వాతంత్ర్య సమరయోదులైన అల్లూరి సీతరామరాజు, కొమురం భీంలు ఒకే చోట ఉంది ఒకేపట్టాన ఉంది పోరాటం చేస్తే ఎలాఉండేది అనేదే సినిమా స్టోరీ లైన్. ఇక వీరి పాత్రల్లో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కనిపించనున్నారు. పైగా ఈసీనిమాకి బాలీవుడ్ తారలు మరింత సొగసుని రియాలిటీ ని యాడ్ చేస్తున్నారు. బాలీవుడ్ తారలు ఆలియా భట్, అజయ్ దేవగన్, వరుణ్ ధావన్ లు నటిస్తున్నారు కాగా ఎన్టీఆర్ కోసం బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ నిత్య మీనన్ లని పరిశీలిస్తున్నారు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా లో మరో స్టార్ హీరో ని ప్రత్యేక పాత్రలో చూపించబోతున్నారట.. అతనే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తో రాజమౌళి ఎంత పేరు సంపాదించుకున్నాడో ప్రభాస్ కూడా అంటే గుర్తింపు సంపాదించాడు. ఇక రాజమౌళి ప్రభాస్ ని ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో ఒక గెస్ట్ పాత్రలో చూపించబోతున్నారట పాత్ర కొంతసేపే ఉన్నప్పటికీ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందట.. ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్టుగా పాత్ర కి కథ సిద్ధం చేశాడట రాజమౌళి. తాజాగా ప్రాభాస్ కి ఆ పాత్ర గురించి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. రాజమౌళి కానీ ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ ముగ్గురిలో ఏ ఒక్కరూ ప్రభాస్ ని నటించమని అడిగినా ప్రభాస్ అస్సలు కాదనలేదు, ఎందుకంటే వీరి మధ్య ఉన్న స్నేహం సాన్నిహిత్యం అలాంటిది. ఇంతే కాదు సినిమా నడుస్తున్నప్పుడు వెనక వచ్చే వాయిస్ ఓవర్ కూడా ప్రభాస్ ఏ ఇవ్వబోతున్నాడాట..! ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఉంటే మాత్రం సినిమా స్థాయి తప్పకుండా ఇంకొంత పెరుగుతుంది మార్కెట్ కూడా పెరుగుతుంది పైగా సినిమా మీద ప్రేక్షకులకి ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతాయి. ఇలా వార్తలు అయితే వచ్చాయి ఇక ఆర్‌ఆర్‌ఆర్ చిత్రా యూనిట్ నుండి అధికారిక ప్రకటన కొరకు వేచి చూడాల్సిఉంది.

Share.

Comments are closed.

%d bloggers like this: