సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు వివాదాలతోనే నిమగ్నమై ఉంటాడు. తన చుట్టూ వివాదాలు ఉంటాయో లేక ఈయనే వివాదాల నడుమ ఉంటాడో ఎవ్వరికీ తెలియదు ఆయనకి తప్ప..! అతని సినిమాల్లోనూ వివాదాలే ఉంటాయి అతని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసే కంటెంట్ లోనూ వివాదమే ఉంటుంది. సమాజం అంతా ఒకలాగా ఉంటే ఈయన మాత్రం ఊహలకి అతీతంగా ఉంటాడు. ఇక వర్మ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కి వ్యతిరేకంగానే ఉంటాడు. ఎప్పుడూ చంద్రబాబుని టార్గెట్ చేస్తూ తన ట్విట్టర్ ఫేస్ బుక్ అకౌంట్ల ద్వారా ఏదో ఒక వ్యంగ్యపు విమర్శో ఫోటోనో వదులుతూ ఉంటాడు ఇక ఇదే తరహాలో ఆయన మొన్న ఒక ట్వీట్ చేశాడు అది కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో ని మార్ఫింగ్ చేస్తూ..
చంద్రబాబు ఫోటోని మార్ఫింగ్ చేస్తూ ఆయన జగన్ సమక్షంలో పార్టీలో చేరారని ఆ ఫోటోని షేర్ చేశాడు. ఆ ఫోటో లో ఎవరో వ్యక్తి జగన్ పార్టీ లో చేరుతున్నట్టుగా ఉంటే ఆ వ్యక్తి ముఖానికి చంద్రబాబు ముఖాన్ని పెట్టి చంద్రబాబు వైసీపీ చేరారంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు ఇక ఆ ఫోటో చాలా వైరల్ అయ్యింది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ఇక ఆ ఫోటో ని వర్మ షేర్ చేసినందుకు తెలుగుదేశం పార్టీ నేతలు ఆయనపై బగ్గుమంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అవమానపరిచేలా సోషల్ మీడియాలో రాంగోపాల్‌వర్మ పెట్టిన పోస్టులపై యాక్షన్ తీసుకోవాలని కోరుతూ ఓ టీడీపీ కార్యకర్త హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. రాంగోపాల్‌వర్మ తన ఫేస్బుక్, ట్విటర్ అకౌంట్లలో చంద్రబాబును అవమానపరిచేలా ఫొటోలు మార్ఫింగ్ చేసి పోస్టింగ్స్ పెట్టారని బాచుపల్లి మా విలాస్ కాలనీకి చెందిన దేవి వీర వెంకట సత్యనారాయణ చౌదరి పోలీసులకు తెలిపారు. వర్మకి ఒక స్థాయి ఉంది ఇలాంటి దిగజారుడు పోస్టు లు పెట్టవద్దని దాంతో ఆయన స్థాయే పడిపోకుండా చంద్రబాబు ని కూడా అవమానించినట్టు అవుతుందని ఇప్పటికే ఆ ఫోటో ని ఎంతో మంది చూశారాణి ఆయన పై గట్టి యాక్షన్ తీసుకోవలసిందిగా వాళ్ళు పోలీసులని కోరారు.
Wowwww in a shocking twist, just now CBN joined YSRCP. pic.twitter.com/wmY0VMzZJn
— Ram Gopal Varma (@RGVzoomin) April 13, 2019