పోలింగ్ ముగిసింది ఎవరికి వాళ్ళు తమ పార్టీనే ప్రజలు ఆశీర్వదించారని తమ నాయకుదే సీఎం అని చెప్పుకుంటునారు. ప్రజాతీర్పు వెల్లడవ్వడానికి ఇంకొన్ని రోజులు సమయం ఉంది ఈలోపే అధినేతలు సైతం సర్వేలని అనుచరుల భరోసాలని నమ్మి సీఎం అయిపోయినట్టుగా భావిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సర్వేలు తమకే అనుకూలంగా వచ్చాయని 110 నుండి 140 స్థానాల్లో తమదే గెలుపని భరోసా వ్యక్తం చేస్తున్నాడు ఇక జగన్ అయితే తాను సీఎం అయిపోయినట్టుగా ప్లేట్ ని తయారు చేయించుకున్నాడని ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. ప్రజా తీర్పు ని ఎవ్వరూ పట్టించుకోడం లేదు.
ఫలితాలకి ఇంకా నెల రోజులు ఉన్నప్పటికీ పార్టీ లోని ముఖ ప్రతినిదులు తమకు కావల్సిన ప్రయోజనాలకి పదవులను అడగటానికి అధినేతల ఇళ్ల వద్ద క్యులు కడుతున్నారు. . జగన్ పార్టీలో కీలక నేతలు పార్టీ అధికారంలోకి వచ్చేసిందని ఫీల్ అవుతున్నారు. దీంతో తమకు ఏ మంత్రి పదవి కావాలో కూడా నిర్ణయించుకొని జగన్ వద్ద ప్రతిపాదనలు చేస్తోన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా పార్టీలో చేరిన కొద్ది రోజుల్లోనే పార్టీలో కీలక గొంతుగా మారిన రోజా ఈ అంశంలో కాస్త ముందున్నారు. నగరిలో వార్ వన్ సై అని గెలుపు కాయం అని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ పార్టీ గెలవబోతుందని ఆ పార్టీ కేబినెట్ లో మంత్రి పదవి పై రోజా కన్నేసినట్టు తెలుస్తుంది.
గతంలో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి సీఎం అయినప్పుడు తన కేబినెట్ లో సబితా ఇంద్ర రెడ్డి కి హోమ్ మంత్రి పదవిని ఇచ్చిన విషయం తెలిసిందే ఆమెకి హోమ్ మంత్రి పదవిని ఇచ్చినందుకు రాజశేఖర్ రెడ్డికి చాలా ప్లస్ అయ్యింది. మహిళలు రాజశేఖర్ రెడ్డి పట్ల మక్కువ చూపించడానికి అదో కారణమ అయ్యింది. ఇక ఇప్పుడు ఆయన తనయుడు జగన్ కూడా గెలవబోతున్నాడని ఆయాన కేబినెట్ లో తనకి మంత్రి పదవి ఇవ్వబోతున్నాడని రోజా భావిస్తుంది. ఇక చూడాలి ప్రజలు ఎవరి పక్షానా ఉండబోతున్నారో ఎవరు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారో.. ఇక మంత్రి పదవి అంటే చాలా సమయం ఉంది అనే చెప్పాలి.