3 ఏళ్ల చిన్నారి పై స్కూల్ ఆయాల …… దాడి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మూడేళ్ళ చిన్నారి పై స్కూల్ లో పని చేస్తున్న ఆయాలు లైంగిక దాడులకి పాల్పడ్డారు. ఈ ఘటన మాదాపూర్ లో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మాదాపూర్ పోలీసులకి ఫిర్యాదు చేయగా పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. మాదాపూర్ కి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తమ ఇంటికి సమీపంలో ఉన్న స్కూల్ లో తమ కూతురుని చేర్చారు. అయితే ఈ నెల 10 వ తేదీన ఆ చిన్నారి తన తల్లిదండ్రులకి తన పై జరిగిన దాడి గురించి చెప్పింది. తనని పరిశీలించిన తల్లిదండ్రులకి చిన్నారి జననాగం పై గాయాలు కనిపించాయి. ఇక చికిత్స కొరకు ఆసుపత్రికి తరలించారు.

కోపం తో తల్లిదండ్రులు స్కూల్ యజమాన్యం పై ఆయాలపై పోలీసులకి ఫిర్యాదు చేశారు తన కూతురు పై జరిపిన దాడులకి కటిన శిక్షలు అమలు చేయాలని ఆ చిన్నారి తల్లి పోలీసులని కోరింది. పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాలికకి ఊరూరికే మూత్రం వస్తుందని కోపగించిన ఆయాలు ఈ దాడికి పాల్పడ్డారని విచారణలో తేలింది.

Share.

Comments are closed.

%d bloggers like this: