‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ లో జూనియర్ ఎన్ఠీఆర్ కు గాయం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

దర్శక ధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్ కు మరో షాక్ తగిలింది. ఇటీవల పూణేలో షూటింగ్ జరుగుతున్న వేళ, రామ్‌ చరణ్‌ గాయపడగా, షూటింగ్‌ మూడు వారాల పాటు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా షూటింగ్ హైదరాబాద్‌ లో ప్రారంభం కాగా, ఎన్టీఆర్‌ కూడా గాయపడ్డాడు. ఆయన కుడి చేతికి గాయం అయినట్టు తెలుస్తోంది. అయితే, ఈ గాయం మరీ పెద్దదేమీ కాలేదని, చేతికి కట్టుతోనే ఎన్టీఆర్ షూటింగ్ కు వస్తున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఇక తారక్ కు గాయం అయిందని తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ ..త్వరగా కోలుకొని షూటింగ్ కి హాజరుకావాలని కోరుతున్నారు. రామ్‌ చరణ్‌ సరసన బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుండగా ఎన్టీఆర్‌ కు జోడిగా ఇంకా ఎవరిని ఖరారు చెయ్యలేదు.

Share.

Comments are closed.

%d bloggers like this: