ఆ తప్పెవరిది..శిక్ష ఎవరికి..?

Google+ Pinterest LinkedIn Tumblr +

బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌…అడ్రెస్‌ ఎవరూ చెప్పక్కర్లేదు…అటువైపు వెడుతుంటూనే గత ఐదురోజులుగా విద్యార్ధుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి….తల్లిదండ్రుల ఆక్రోశం వినిపిస్తోంది…విద్యార్ధులకు న్యాయం చెయ్యాలంటూ విద్యార్ధిసంఘాల డిమాండ్లు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. అసలు ఎందుకు ఈ ఇంటర్‌ పరీక్షల ముందు హాల్‌ టికెట్లు జారీ చేశారు. వాటిలో బోలెడు తప్పులు దొర్లాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంటర్‌ బోర్డు ఎదుట ఆందోళన చేశారు. ఫిబ్రవరి 17వ తేదీ అర్ధరాత్రి వరకూ హాల్‌ టికెట్లలో తప్పులు సరి చేయించుకుని 18వ తేదీన ఉదయమే పరీక్షకు హాజరయ్యారు. ఇంటర్‌ ఫలితాలు వెల్లడించారు. ‘99’ మార్కులు వచ్చిన విద్యార్థికి ‘00’ మార్కులు వేశారు.

మొత్తంమీద 900 మార్కులకుపైగా తెచ్చుకున్న టాపర్లనూ కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ చేశారు. ఓ విద్యార్థి ఫస్టియర్లో అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. కానీ, సెకండియర్‌ ఫలితాల తర్వాత ఫస్టియర్లో మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ చేశారు. ఇలా.. హాల్‌ టికెట్ల జారీ నుంచి ఫలితాల వెల్లడి వరకూ ఇంటర్‌ బోర్డు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. సాధారణంగా, ఇంటర్‌ ఫలితాలు వెల్లడైతే.. కొంతమంది విద్యార్థుల్లో సంతోషం కనిపిస్తుంది. మరి కొంతమందిలో బాధ కనిపిస్తుంది. ఇందుకు భిన్నంగా ఈ ఏడాది మొత్తం విద్యార్థులందరి ముఖాలు కన్నీటితో కనిపిస్తున్నాయి. పాసైన విద్యార్థి కళ్లు, ఫెయిలైన విద్యార్థి కళ్లు.. చివరికి టాపర్ల కళ్లు కూడా కన్నీటి పర్యంతమయ్యేలా చేశాయి. దీనికి కారకులెవరు? ఈ పాపం ఎవరిది? ఈ తప్పు ఇంటర్మీడియట్‌ బోర్డుదా? గ్లోబరీనా సాఫ్ట్‌వేర్‌ సంస్థదా? అనే విషయం తెలియాల్సి ఉంది.

తాజా పరిస్థితి చూస్తే ఈ సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఇంటర్‌ బోర్డు దగ్గర భద్రతను కట్టుదిట్టం చేసింది….బోర్డునుపోలీసుల ఆధీనంలోకి తీసుకుంది…విద్యార్ధులు కనీసం అడిగే అవకాశం లేకుండా చేసింది…దీంతో మాజీ ఎంఎల్‌సీ నాగేశ్వర్‌ లాంటి వాళ్లు స్వయంగా ఆందోళన చేపట్టారు…ఇక విద్యార్ధి సంఘాలు బోర్డును చుట్టుముట్టి విద్యార్ధులకు న్యాయం చెయ్యమని అడుగుతున్నయి. జరిగిన తప్పిదానికి విద్యార్థుల ఆత్మహత్యలు రోజులు రోజుకు ఎక్కువైపోతున్నాయి. ఇక నుంచి అయిన అధికారులు జగ్రత్తపడి..అమాయక విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని కోరుకుందాం.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: