Advertisements

అయ్యో..శ్రుతి, మైఖెల్‌ బ్రేకప్ చెప్పేసుకున్నారు

Google+ Pinterest LinkedIn Tumblr +

లోకనాయకుడు కమల్ హాసన్ తన ఇద్దరు కూతుర్లకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. వాళ్ళ మనసుకు ఏది నచ్చితే అది చేసే స్వేచ్ఛ ఇచ్చారు. ఇప్పుడు ఇందంతా ఎందుకు చెప్తున్నానో టైటిల్ చుస్తే అర్ధమైంది కదా. మొన్నటివరకు నిను వీడని నీడను నేను..అంటూ ఒకరికోసం మరొకరు ఇండియా టూ లండన్ చక్కెర్లు కొట్టేవారు శృతి హాసన్, మైకేల్. ప్రియుడి బర్త్ డే అయితే తన లోని ప్రేమతంతా కుమ్మరిచ్చి శుభాకాంక్షలు చెప్పింది శృతి. ఇంతవరకు బాగానే ఉన్నా..షడన్ గా ఏమైందో ఏమో కానీ..వీళ్ళిద్దరూ తాజాగా బ్రేకప్ చెప్పేసుకున్నారు.
ఈ విషయాన్ని మైఖెల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా స్పష్టం చేశారు. ‘జీవితం మమ్మల్నిద్దరినీ వ్యతిరేక మార్గాల్లో ఉంచింది. దురదృష్టవశాత్తు మేమిద్దరం ఒంటరి మార్గాల్లో నడవాల్సి వస్తోంది. కానీ ఈ యంగ్‌ లేడీ ఎప్పటికీ నా బెస్ట్‌ ఫ్రెండ్‌గానే మిగిలిపోతుంది. ఆమెకు జీవితాంతం ఓ స్నేహితుడిగా ఉండిపోతున్నందుకు చాలా గొప్పగా ఫీలవుతున్నాను’ అంటూ శ్రుతితో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అయితే ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, పరస్పరం చర్చించుకుని స్నేహపూర్వకంగానే విడిపోయారని సన్నిహిత వర్గాలు మీడియా ద్వారా వెల్లడించాయి.
2016లో శ్రుతి ఓ కాన్సర్ట్‌ నిమిత్తం లండన్‌ వెళ్లినప్పుడు అక్కడ ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా మైఖెల్‌ను కలిశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారింది. శ్రుతి నెలకోసారైనా మైఖెల్‌ కోసం లండన్‌ వెళ్లి వస్తుండేవారట. శ్రుతి ఇంట్లో జరిగే శుభకార్యాలకు మైఖెల్‌ కూడా హాజరవుతుండేవారు. మైఖెల్‌.. శ్రుతి తల్లిదండ్రులను కూడా కలిశారు. వీరి పెళ్ళికి కమల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ బ్యాడ్ లక్ వీళ్ళిద్దరూ విడిపోయారు.

Advertisements
Share.

Comments are closed.

%d bloggers like this: