ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు వారణాసిలో నామినేషన్ వేయనున్నారు. ఇందులో భాగంగా ముందుగా ఆయన భాజపా కార్యకర్తలతో సమావేశంలో పాల్గొంటారు. అక్కడి బాబా కాల భైరవ ఆలయంలో, కాశీ విశ్వనాథ్ ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. తర్వాత ఉదయం 11:30గంటలకు నామినేషన్ వేస్తారు. భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో పాటు ఎన్డీయే కూటమిలోని ప్రధాన నేతలందరూ ఇప్పటికే వారణాసి చేరుకున్నారు.
వీరందరితో అమిత్షా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్, రాజ్నాథ్ సింగ్, శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నామినేషన్ కి బీజేపీ కార్యకర్తలంతా పెద్ద ఎత్తున హాజరుకానున్నట్టు తెలుస్తోంది. ఈ సారి కూడా మోడీ గెలవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు పార్టీ వర్గాలు.
వారణాసిలో మోడీ నామినేషన్
Share.