టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం ‘మన్మథుడు 2’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. పోర్చుగల్‌లో సినిమా షూటింగ్ సెరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాహుల్.. నాగ్‌కు సంబంధించిన కొన్ని లుక్స్‌ను ఇటీవల సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. నాగ్ చేసిన మరికొన్ని స్టంట్స్‌కు సంబంధించిన ఫొటోలను అభిమానుల కోసం విడుదల చేశారు. ఫొటోలో నాగ్ కసరత్తులు చేస్తూ కనిపించారు. ఈ లుక్‌లో ఆయన మరింత హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు.
ఈ చిత్రంలో నాగ్‌కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. సమంత స్పెషల్ పాత్రలో కనిపిస్తారు. నాగార్జున, పి.కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కథ దాదాపుగా పోర్చుగల్ చుట్టూ తిరుగుతుంది. ఈ షెడ్యూల్‌తోనే పాటలతో పాటు టాకీ పూర్తి చేయాలని సినిమా యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
వామ్మో..నాగ్ స్టంట్స్ మాములుగా లావుగా..!
Share.