హాలీవుడ్ లో సినిమా చేద్దాం రండి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

‘బాహుబలి’, ‘2.ఓ’ వంటి భారీ బడ్జెట్‌ సినిమాల తర్వాత దక్షిణాదికి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు లభించింది. ఇటీవల ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ డైరెక్టర్‌ జో రుసో కూడా దక్షిణాది గురించి మాట్లాడారు. శంకర్‌ తెరకెక్కించిన ‘రోబో’ సినిమా స్ఫూర్తితో ‘అవెంజర్స్‌: ది ఏజ్‌ ఆఫ్‌ ఆల్ట్రన్‌’ సినిమాను తీసినట్లు చెప్పారు. ఇప్పుడు పాపులర్‌ హాలీవుడ్‌ స్టార్‌ బిల్‌ డ్యూక్‌ టాలీవుడ్‌ స్టార్స్‌ మహేశ్‌బాబు, వంశీ పైడిపల్లి, తమిళ దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్‌లను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. అన్నీ కుదిరితే ఓ అంతర్జాతీయ స్పై సినిమా తీద్దామంటూ వారిని లంచ్‌కు ఆహ్వానించారు. అంతేకాదు మహిళల అక్షరాస్యత అభివృద్ధి విషయంలో అంతర్జాతీయ కార్యక్రమాల ఏర్పాటు గురించి చర్చిద్దామని ఐశ్వర్య ధనుష్‌కు బిల్‌ చెప్పారు.
ఐశ్వర్యను 2016లో యునైటెడ్ నేషన్స్ ఉమెన్స్ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేసింది. ఈ మేరకు ఆమె మహిళల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు.
మరో వైపు వంశీ పైడిపల్లి, మహేశ్‌బాబు మీరు లాస్‌ ఏంజెల్స్‌కు వచ్చినప్పుడు డౌన్‌టౌన్‌ లాస్‌ఏంజెల్స్‌ లో దిగి, భోజనానికి రండి. ఇంటర్నేషనల్‌ స్పై సినిమా గురించి చర్చించుకుందాం అని బిల్‌ ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో ఎ.ఆర్‌.మురుగదాస్‌, మహేశ్‌బాబులను చర్చలకు ఆహ్వానించారు. ఓ హాలీవుడ్‌ స్టార్‌ మహేశ్‌ను ఆహ్వానించడంతో మహేష్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: