నటి సురేఖ వాణి భర్త మృతి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ నటి సురేఖ వాణి భర్త మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె భర్త సోమవారం ఉదయం మరణించారు. సురేఖ వాణి భర్త పేరు సురేష్ తేజ. వీరిద్దరిది ప్రేమ వివాహం. సురేష్ కూడా అనేక తెలుగు టీవీ ప్రొగ్రామ్స్, టీవీ షోలకు డైరెక్టర్‌గా పనిచేశారు. సురేఖ టవీ యాంకర్‌గా ఉన్న సమయంలోనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సురేష్. మాటాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ వంటి టీవీ షోలు సురేష్ తేజ డైరెక్ట్ చేశారు.
ఈ ప్రొగ్రామ్స్‌కు సురేఖ వాణి యాంకర్‌గా వ్యవహరించారు. అకస్మాత్తుగా ఆమె భర్తను పొగొట్టుకోవడంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ నటులు, సీరియల్ యాక్టర్స్ సురేఖవాణి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సురేఖ వాణి మంచి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక సినిమాల్లో కామెడీ క్యారెక్టర్లు కూడా చేసి నటనతో అందర్నీ మెప్పించారు. అలాంటి ఆమెకు ఈ కష్టం రావడంతో తెలుగు ప్రేక్షకులతో పాటు.. సినీప్రముఖులు కూడా తీవ్ర సానుభూతి వ్యక్తంచేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: