‘అరుంధతి’లో జేజమ్మ పాత్ర అనుష్కది కాదంట..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అనుష్క కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అంటే..అది ఖచ్చితంగా అరుంధతి సినిమానే. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జేజమ్మగా అనుష్క ఎంత బాగా నటించిందో అందరికీ తెలుసు. కానీ ఆ పాత్ర కోసం ముందుగా అనుష్కని అనుకోలేదట చిత్ర యూనిట్. జేజమ్మగా మంచు లక్ష్మిని అనుకున్నారట. అప్పుడు ఆమె అమెరికాలో ఉండటంతో అది కుదరలేదు. ఆ తరువాత మమతా మోహన్ దాస్ ను అనుకున్నారు. ఆనేకు క్యాన్సర్ ఉండటంతో నో చెప్పిందట.
చివరగా ఆ ప్రాజెక్ట్ అనుష్క చేతిలో పడింది. అయితే, అనుష్కను కూడా ఆ పాత్ర కోసం సులభంగా ఒకే చేయలేదు. ఆమెపై డమ్మీ షూట్‌ చేశారు. జేజెమ్మ పాత్రకు సంబంధించిన కాస్ట్యూమ్స్‌ను ప్రత్యేకంగా తయారు చేయడానికి కేరళ నుంచి డిజైనర్లను రప్పించారు నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి. నాలుగు లక్షలు ఖర్చు పెట్టి రెండు రకాల కాస్ట్యూమ్స్‌ తయారు చేయించారు. వాటిని అనుష్క ధరించిన తర్వాత అందరూ బాగుందని మెచ్చుకుంటే, శ్యాంప్రసాద్‌రెడ్డి మాత్రం ఇక్కడ బాగానే ఉంటుంది. సెట్‌లోకి వెళ్లిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి అని సెట్‌కు తీసుకెళ్లారట. తీరా, అక్కడకు వెళ్లిన తర్వాత కథ ప్రకారం అనుకున్న సెట్‌కు, డిజైన్‌ చేయించిన దుస్తులకు సరిపోకపోవడంతో వాటిని పక్కన పెట్టేసి, కొత్త కాస్ట్యూమ్స్‌ను తయారు చేయించారు. ఇందు కోసం మూడు, నాలుగు నెలలు సమయం తీసుకున్నారు. ఆ తర్వాతే స్వీటిని ఓకే చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: