‘మహర్షి’ బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్న సోషల్ మీడియా

Google+ Pinterest LinkedIn Tumblr +

‘ఏలేద్దాం అనుకుంటున్నా సార్.. ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటున్నా సార్..’ అంటూ ‘మహర్షి’ ట్రైలర్‌లో ధీమాగా చెప్పిన మహేష్ బాబు అన్నట్టుగానే ప్రపంచాన్ని ఏలేస్తున్నాడు అనే టాక్ ఇప్పటికే వినిపిస్తుంది. మహేష్ కెరియర్‌లో 25వ సినిమాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహర్షి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నేడు థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌ను తెచ్చుకుంటోంది. గత రాత్రి నుండే థియేటర్స్ వద్ద అభిమానులు కోలాహలం మొదలైంది. ఇప్పటికే యూఎస్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల బెనిఫిట్ షో‌లు ప్రదర్శితం కావడంతో సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా బొమ్మ బ్లాక్ బస్టర్.. బాబు బంగారం.. అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
మరో వైపు మహేష్ కెరీర్ లోనే ఈ సినిమా మైల్ స్టోన్ గా నిలవడం ఖాయం అంటున్నారు సినీ జనాలు. మరో మహర్షి కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలంటే జస్ట్ 2 డేస్ ఆగితే సరిపోతుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా..దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: