మరో వేదిక నిర్మించి..ప్రజావేదిక కూల్చివేయాలి.. ఎంపీ కేశినేని..

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రజావేదిక కూల్చివేసే ముందు,
ప్రత్యామ్నాయ ఏర్పాటుగా మాతో సమావేశ మందిరం నిర్మించి అనంతరం ప్రజావేదిక తొలగిస్తే బావుంటుందని ఎంపీ కేశినేని నాని ఫేస్ బుక్ ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

మొదటి విషయం.. ప్రజాధనంతో నిర్మించారు కాబట్టి, అది కూల్చేస్తే ఆ సొమ్ము వృథా అవుతుంది.

రెండో విషయం ఏంటంటే, మరో వేదిక కట్టేవరకు ప్రభుత్వ సమావేశాలను నిర్వహించుకోవాలంటే ప్రైవేట్ వేదికలకు డబ్బు ఖర్చవుతుంది. కాబట్టి ముందుగా మిగతా అక్రమ నిర్మాణాలను తొలగించి, ఈ లోపు కొత్త సమావేశ వేదిక నిర్మించి, అప్పుడు ఈ ప్రజావేదిక తొలగిస్తే బావుంటుంది అంటూ తన అభిప్రాయాలను వెల్లడించారు.

‘‘ప్రజావేదిక అక్రమమో, సక్రమమో పక్కన పెడితే, అది ప్రజాధనంతో నిర్మించినటువంటి వేదిక. కాబట్టి ప్రజావేదికను తొలగించాలనుకుంటే, అక్రమ నిర్మాణాలన్ని తొలగించిన తర్వాత, ప్రజావేదికను చివర్లో తొలగిస్తే బావుంటుందని కేశినేని వ్యాఖ్యానించారు..

Share.

Comments are closed.

%d bloggers like this: