దేశంలోనే అత్యంత ధనికుడు ఆయనే: మురళీ మోహన్

Google+ Pinterest LinkedIn Tumblr +

తన కెరియర్, బిజినెస్ తదితర విషయాలను ఓ ఇంటర్వ్యూలో మురళీ మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు శోభన్‌బాబు గురించి ప్రత్యేకంగా చెప్పారు. శోభన్‌బాబుతో తనకు మంచి సాన్నిహిత్యం ఉండేదని, ఆయనకు ముందు చూపు చాలా ఎక్కువని తెలిపారు. శోభన్‌బాబు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారని, ఎక్కువ శాతం డబ్బును స్థలాలపై వెచ్చించారని తెలిపారు.

 

ఎక్కడ నచ్చితే అక్కడ శోభన్‌బాబు ఎకరం రూ.5 వేలకు కొంటే.. ఆ తరువాత ఎకరం రూ. 50 కోట్లకు పెరిగిందని మురళీమోహన్ చెప్పుకొచ్చారు. అలా చెన్నై పరిసర ప్రాంతాల్లో ఎన్నేసి స్థలాలు కొన్నారో లెక్కలేదని, ఒకరకంగా భారతదేశంలోని సినీ ఆర్టిస్టులందరిలోకి శోభన్‌బాబే అత్యంత ధనికుడని చెప్పాలని మురళీమోహన్ తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: