ఆందోళనలకు అడ్డాగా ఏపీ సీఎం నివాసము | సీఎం ఇంటి వద్ద పెరుగుతున్న ఆందోళనలు | ధర్నా చౌక్‌గా భరతమాత సెంటర్‌

Google+ Pinterest LinkedIn Tumblr +

అమరావతి :
గుంటూరు జిల్లా తాడేపల్లి టౌన్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

వివిధ వర్గాల ప్రజలు తమ డిమాండ్లను సాధించుకునేందుకు రోజూ పెద్ద సంఖ్యలో తరలివస్తున్న నేపథ్యంలో జగన్‌ నివాసం నిరసనల హోరుతో దద్దరిల్లిపోతోంది.

జగన్‌ నివాసానికి వెళ్లే దారిలోని ప్రధాన కూడలి భరతమాత సెంటర్‌ తెలంగాణలోని ధర్నా చౌక్‌ను తలపిస్తోంది.

బుధవారంనాటి ఆందోళనల విషయానికి వస్తే… కానిస్టేబుల్‌ నియామకాలను పెంచాలని కోరుతూ గత ఆరురోజులుగా సీఎం నివాసం వద్ద ఆందోళనను కొనసాగిస్తున్న 15 మందిని పోలీసులు..

వారిని అదుపులోకి తీసుకొని… 7 గంటల తర్వాత వదిలిపెట్టారు.

రేషన్‌ డీలర్ల వ్యవస్థ రద్దవుతుందన్న కథనాల నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ఈ-పోస్‌ ఆపరేటర్స్‌ (రేషన్‌డీలర్ల) సంక్షేమ సంఘం బ్యానర్లు ప్రదర్శించారు.

ఉద్యోగ భద్రత కల్పించాలని 5 రోజులుగా సాక్షరభారత్‌ ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు.

ఇక డైరెక్ట్‌ రిక్రూట్‌ వీఆర్‌ఏలు, కడపజిల్లా రాయిచోటికి చెందిన శివ అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేశారు.

నేడు మీసేవా ఆపరేటర్లు, కేఎల్ యూనివర్సిటీ భారీన పడ్డ తల్లిదండ్రులు, ప్రభుత్వం కార్యాలయంలో పనిచేస్తున్న వారిని తొలగించి కొత్తగా ఆపరేటర్లు తీసుకోవడం నిరసన తెలియజేయనున్నారు

Share.

Comments are closed.

%d bloggers like this: