వరుణ్-వితిక రొమాన్స్, హిమజ ఏడుపు, పొట్టి నిక్కర్లో శ్రీ ముఖి..!
బిగ్ బాస్ … ఈ పేరు వింటే చాలు ఎంతో మంది ప్రేక్షకులు వచ్చి టీవీల ముందు వాలిపోతున్నారు. అంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ కార్యక్రమం. కాగా ఈ కార్యక్రమానికి సంబందించిన మూడవ సీజన్ కూడా ఈ మధ్యనే ప్రారంభం అయింది. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని మరీ ఈ బిగ్ బాస్ 3వ సీజన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సీజన్ మాత్రం చాలా రసవత్తరంగా ఉండనుందని ముందు నుండే చెప్పుకొచ్చారు. కాగా ఈ కార్యక్రమం ప్రారంభం అయిన కొద్దీ క్షణాల్లోనే బిగ్ బాస్ వీరికి పెద్ద షాక్ ఇచ్చాడు. తొలిరోజే నామినేషన్స్ ప్రక్రియ మొదలుపెట్టిన బిగ్‌బాస్, కంటెస్టెంట్ల మధ్య చిచ్చు కూడా పెడుతున్నాడు. మొదట హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి ముగ్గురు కంటెస్టెంట్స్(రవిక్రిష్ణ, శివజ్యోతి, అశు) బిగ్ బాస్ ఆదేశాల మేరకు మిగిలిన ఇంటి సభ్యులను ఎంట్రీలోనే ప్రశ్నలు అడిగారు… అయితే అందులో సరైన సమాదానాలు చెప్పని ఆరుగురి పేర్లు చెప్పాలని, బిగ్‌బాస్ ఆదేశించారు. అయితే రాహుల్, వరుణ్ సందేశ్, వితికాశేరు, శ్రీముఖి, బాబా బాస్కర్, జాఫర్‌ల పేర్లను చెప్పడంతో వారు ఈవారం నామినేషన్ అవ్వడం తెలిసిందే. కాగా వీరికి నామినేషన్ నుండి తప్పించుకునేందుకు అవకాశం ఇచ్చిన బిగ్ బాస్, అందులో కూడా వీరికి ఒక మెలిక పెట్టాడు. తమకు బదులుగా ఇంకో ఇంటి సభ్యుణ్ని నామినేట్ చేయాలని చెప్పారు. కాకపోతే దానికి వారు సరైన కారణాలు చెప్పాలని, ఆలా అయితేనే సమ్మతం తెలుపుతామని బిగ్ బాస్ అన్నారు. అయితే ఈ తతంగానికంతటికి హేమను జడ్జిగా నియమించడం జరిగింది. మొదటిగా రాహుల్ తనకి బదులుగా నామినేట్ చేయడానికి శివజ్యోతిని ఎంపిక చేసుకున్నాడు. అయితే, శివజ్యోతిని నామినేట్ చేయడానికి అతను చెప్పిన కారణం సరిగాలేదని హేమ నిర్ణయించింది. దీంతో బిగ్ బాస్ మళ్లీ రాహుల్‌నే నామినేట్ చేశారు. ఆ తరవాత వరుణ్ సందేశ్.. పునర్నవిని ఎంపిక చేసుకున్నాడు. వరుణ్ సందేశ్ చెప్పిన కారణం సరిగా ఉందని భావించిన హేమ ఆయన బదులు పునర్నవిని నామినేట్ చేసింది. అనంతరం వరుణ్ సందేశ్ భార్య వితికా షెరు.. అశురెడ్డిని నామినేట్ చేసింది. అయితే, వితికా షెరు తన కారణంతో హేమను కన్వెన్స్ చేయలేకపోయింది. దీంతో మళ్లీ ఆమెనే హేమ నామినేట్ చేసింది. జాఫర్ తన బదులు మహేష్ విట్టను నామినేషన్‌కు ఎంపికచేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఆయన చెప్పిన కారణం సరైంది కాదని హేమ తేల్చేసింది. ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన శ్రీముఖి తన బదులు హిమజను ఎంపిక చేసుకుంది. అయితే, శ్రీముఖి చెప్పిన కారణం హిమజకు ఆగ్రహం తెప్పించింది. హిమజ తనకు ఎప్పటి నుంచో తెలుసని, తాను ఎప్పుడూ రిజర్వ్‌గా ఉంటుందని శ్రీముఖి అన్న మాటలు హిమజను బాధించాయి. నా పర్సనల్ లైఫ్ గురించి నీకెలా తెలుసంటూ అంతెత్తున లేచిన హిమజ భావోద్వేగానికి గురై ఏడ్చేసింది. దీంతో అక్కడ రచ్చ మొదలైంది. హేమ కూడా శ్రీముఖికి సపోర్ట్ చేయడంతో నేను నిందలు పడను అంటూ హిమజ గట్టిగా వాదించింది. రూల్స్ అందరికీ ఒక్కటేనంటూ అరిచింది. కానీ, హేమ మాత్రం శ్రీముఖి బదులుగా హిమజనే ఎలిమినేషన్‌కు నామినేట్ చేసింది. ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్లో ఉండగా.. ఐదుసార్లు మాత్రమే బెల్ మోగుతుందని బిగబాస్ తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో బాబా భాస్కర్‌కు అవకాశం రాక మిగిలిపోయాడు. అయితే బిగ్‌బాస్ అతనికి కూడా ఓ అవకాశాన్ని ఇచ్చాడు. మానిటర్ గా వ్యవహరించిన హేమ – బాబా భాస్కర్ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని సేవ్‌చేసి, మరొకరిని నామినేట్ చేయాలని ఇంటి సభ్యులను బిగ్‌బాస్ ఆదేశించాడు. ఇందుకోసం అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి ఒకరి పేరును తెలపాలని సూచించాడు. అయితే వారంతా కలసి ఓ నిర్ణయానికి వచ్చి.. బాబా భాస్కర్‌ను సేవ్ చేసి, హేమను నామినేట్ చేశారు. సో.. మొత్తంగా ఈ వారం రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమ నామినేట్ కాగా.. వీరందరిలో ఎవరోకరు ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే, స్లీపింగ్ రూమ్‌లో ఓ బెడ్‌పై మహేష్ విట్ట పడుకున్నాడు. ఇక గదిలో ఎవ్వరూ లేరు. ఈ సమయంలో ముచ్చట్లు పెట్టిన భార్యభర్తలు ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకున్నారు. వీరి కౌగిలింతలు బిగ్ బాస్ కెమెరాల్లో స్పష్టంగా కనిపించాయి. రెండో రోజు ఉదయాన్నే లేచిన వెంటనే ఇంటి సభ్యులంతా ఆనందంగా గంతులేశారు..ముఖ్యంగా పొట్టి నిక్కర్ వేసుకొని బాబా మాస్టర్ తో కలిసి శ్రీ ముఖి వేసిన స్టెప్పులు హైలైట్ అని చెప్పుకోవచ్చు.. ఆ తరవాత ఇంటి సభ్యులందరికీ బాబా భాస్కర్ మాస్టర్ దిష్టి తీశారు. మొత్తం మీద వరుణ్, వితికా రొమాన్స్.. హిమజ ఏడుపు.. శ్రీముఖి డ్యాన్సులు.. బాబా భాస్కర్, జాఫర్ కామెడీతో మూడో ఎపిసోడ్ చాలా ఎంటర్టైనింగ్గా గడిచింది.