ఖైదీతో డేటింగ్..అది కూడా జైల్లో..కానీ, చివరికి ఇలా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రేమ…దీనికోసం కొందరు ప్రాణాలిస్తారు..మరికొందరు ప్రాణాలు తీస్తారు..ప్రేమించిన వారి కోసం ఎంతటి సాహసానికైనా పూనుకుంటారు..అది ప్రేమకున్న గొప్పతనం..తాజాగా ఓ యువతి తన ప్రియుడు జైల్లో ఉండటాన్ని జీర్ణించుకోలేక పోయింది. ఎలాగైనా తన ప్రియుడు చెంతనే ఉండాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఆమె ఓ ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ సక్సెస్ అయింది. దీంతో ఆమె తన ప్రియుడుతో కలిసి జైలు గదిలో గంటల కొద్దీ డేటింగ్ చేసింది. అయితే, ఈ విషయం చివరకు బయటకు పొక్కడంతో ఆమె బండారం బయటపడింది. ఈ వింత ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది..వివరాల్లోకి వెళ్తే..

సాధారణంగా దేశంలో ఉన్న జైళ్ళలన్నింటిలో తీహార్ జైలు ఎంతో కట్టుదిట్టమైన భద్రత కలిగింది. ఇక్కడ ఎంతో మంది ఉగ్రవాదుల, కరుడుగట్టిన నేరస్థుల ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే, అదే జైలులో హేమంత్‌ అనే ఒక యువకుడు ఓ కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. తన ప్రియుడిని వదిలి ఉండలేనని భావించిన యువతి, హేమంత్ ప్లాన్ మేరకు, తనను తాను ఓ స్వచ్ఛంద సంస్థ వాలంటీర్‌గా నమ్మబలికి తొలుత జైలు లోపలికి రావడం ప్రారంభించింది. ఖైదీల్లో పరివర్తన తెచ్చేందుకు ఆమె వస్తోందని నమ్మిన అధికారులు ఆమెను అనుమతించేవారు. అదేసమయంలో ఆ జైలులో పని చేసే ఓ ఉన్నతాధికారితో ఆమె స్నేహం ప్రారంభించింది. ఆయనతో చాలా సన్నిహితంగా మెలగసాగింది. ఈ క్రమంలో జైల్లోని ప్రియుడిని అడ్డూ అదుపూ లేకుండా కలిసేది. గంటల తరబడి అతనితో గడిపేది. ఈ విషయం బయటకు రావడంతో ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. ఆమెకు దగ్గరగా ఉన్న జైలు అధికారిపైనా, ఆమె మాటలను జైలు సిబ్బంది ఎలా నమ్మారన్న విషయంపైనా విచారణ జరిపిస్తామని అధికారులు వెల్లడించారు. జరిగినది తీవ్రమైన నిర్లక్ష్యమని, విచారణ కమిటీని ఏర్పాటు చేశామని, రిపోర్టు రాగానే కఠిన చర్యలు చేపడతామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: