నరసరావుపేట మాజీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు త్వరలో బీజేపీలో చేరనున్నారంటూ గత కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే బీజేపీలో చేరతానని కూడా చెప్పారు. అయితే… ఆయన ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. సడెన్ గా తన నిర్ణయం మార్చుకొని..బీజేపీకాదని.. వైసీపీలోకి వెళ్లాలని ఉత్సాహం చూపిస్తున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. ఇందుకు కారణం ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం పట్ల అయన సానుకూలంగా స్పందించటం..ఈ రోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన రాయపాటి… రాష్ట్రంలో సీఎం జగన్ పరిపాలన బాగుందని వ్యాఖ్యానించారు. అయితే జగన్ ప్రభుత్వానికి కేంద్రం సహకరించలేదని రాయపాటి అభిప్రాయపడ్డారు. తాను పార్టీ మారుతున్నట్టు వార్తలపై కూడా ఆయన స్పందించారు. పార్టీ మారే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న పోలవరం ప్రాజెక్ట్ రీ టెండరింగ్ నిర్ణయం సరికాదని రాయపాటి వ్యాఖ్యానించారు. ఇలా చేయడం వల్ల ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే త్వరలోనే తాను ఏ పార్టీలో చేరాలని అనుకుంటున్నానో ప్రకటిస్తానని పేర్కొన్నారు. ఈ కామెంట్స్ విన్నవారంతా రాయపాటి వైసీపీలో చేరడం ఖాయమని చెబుతున్నారు. అందుకే జగన్ పై ప్రశంసలు కురిపిస్తూ… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని చెబుతున్నారు. మరి దీనిలో నిజం ఎంతుందో తెలియాలంటే… మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.
రూటుమార్చిన రాయపాటి..వైసీపీలోకి..?
Share.