చిరంజీవి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తొలి తెలుగు స్వాతంత్ర ఉద్యమవీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రాంచరణ్ నిర్మాతగా దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఇటీవల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన మేకింగ్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేసింది. ఆగష్టు 20న సైరా టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఈ టీజర్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొనివుంది. తాజాగా సినిమాపై మరింత ఆసక్తిని పెంచే విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది. జనసేనాని పవన్ కళ్యాణ్ సైరా టీజర్ కు వాయిస్ ఓవర్ అందించిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా సైరా టీజర్ లో పవన్ నరసింహా రెడ్డి గురించి ఏం చెబుతారనే ఆసక్తి నెలకొని ఉంది. అయితే ఇప్పుడు పవన్ వాయిస్ ఓవర్ ఇచ్చిన ఓ డైలాగ్ లీక్ అయింది. ‘అందరు గుర్తించిన వీరులు ఎందరో ఉన్నారు.. కానీ ఎవరూ గుర్తించని వీరుడొక్కడు ఉన్నారు.. ఆయనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్ తో టీజర్ ప్రారంభం అవుతుందట. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, తమన్నా, కిచ్చా సుదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.
సైరా లో పవన్ డైలాగ్ ఇదే…ఫాన్స్ కి పూనకాలే..!
Share.