బాబు..దరఖాస్తు చేసుకోపో..ఇల్లు ఇప్పిస్తాం!

Google+ Pinterest LinkedIn Tumblr +

వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి ప్రతిపక్షనేత చంద్రబాబుపై మండిపడ్డారు. ఉండవల్లి కరకట్ట వెంబడివున్న అక్రమ కట్టడాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్కే మీడియాతో మాట్లాడుతూ.. అధికారులు ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారని… అలాంటిది మాజీ మంత్రి దేవినేని ఉమ ఈరోజు కావాలనే కృత్రిమ వరదను ప్రభుత్వం సృష్టించిందని చెప్పడం దారుణమని వ్యాఖ్యానించారు. దీన్నిబట్టే టీడీపీ నేతలు ఎంతగా దిగజారిపోయారో అర్థం అవుతుందని పేర్కొన్నారు. ‘దేవినేని ఉమ గారిని నేను ఒక్కటే అడుగుతున్నా.. అయ్యా దేవినేని ఉమ గారూ.. ఓటుకు నోటు కేసులో విచారణ ప్రారంభం కాకముందే హైదరాబాద్ నుంచి పారిపోయారు. చంద్రబాబు వారికి చిక్కకుండా, దొరకకుండా ఉండేందుకు ఇంటి కోసం మీరు పడవ వేసుకుని ప్రకాశం బ్యారేజీ ఎగువన కృష్ణా నదిలో తిరిగారు. అప్పుడు ఇవన్నీ అక్రమ నిర్మాణాలేననీ, వీటిని తొలగిస్తామని మీరు చెప్పిన మాట వాస్తవం కాదా? ఈ విషయంలో క్లారిటీ ఇవ్వండి. ఐదేళ్లలో ప్రపంచస్థాయి రాజధాని కడతామని చంద్రబాబు అప్పట్లో ప్రకటించారు. కానీ ఇప్పటివరకూ చంద్రబాబు రాజధాని ప్రాంతంలో సెంటు భుమైనా కొన్నారా? సొంత ఇల్లు ఉందా? మీరు అమరావతి రాజధాని అని ప్రకటించగానే అప్పటి ప్రతిపక్ష నేత జగన్ అక్కడే ఇల్లు, ఆఫీసు కట్టుకున్నారు. అంటే రాజధాని నిర్మాణంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉన్నట్లా? లేక జగన్ కు చిత్తశుద్ధి ఉన్నట్లా?. చంద్రబాబుది అక్రమ నివాసమే. ఆయన నివాసంలోని వాహనాలను హ్యాపీ రిసార్ట్స్ కు, ఫర్నీచర్ ను ఇంటిలోని మొదటి ఫ్లోర్ కు తరలించారు. ఈ విషయమై చంద్రబాబు మీడియా ముందుకు రాకుండా ఇతరులతో మాట్లాడించడం భావ్యం కాదు. చంద్రబాబు తనకు ఇల్లు లేదనీ, వాచీ, ఉంగరం లేదని చెబుతున్నారు. మా జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఉగాది నుంచి ఇల్లు లేని వారందరికి పక్కా ఇళ్లు మంజూరు చేయబోతున్నారు. పోయి.. దరఖాస్తు పెట్టుకో. మీ దగ్గరకు కూడా మా వాలంటీర్ వస్తాడు. సెంటో, సెంటున్నరో స్థలం ఇస్తారు. లేదా మీరు లక్షల కోట్ల అవినీతి చేశారు కదా.. ఆ డబ్బులతో కట్టుకున్నా ప్రభుత్వం మీ ఇంటికి భద్రతను కల్పిస్తుంది’ అని రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: