రాహుల్ -పునర్నవి వీళ్ళద్దరు బిగ్ బాస్ హౌస్ లో మంచి అండర్ స్టాండ్ తో నడుస్తున్నారని అందరికి తెలుసు. వీరి మధ్య ట్రాక్ నడుస్తుందంటూ మీమ్స్ హల్చల్ చేస్తుంటాయి. దీనికి తగ్గట్లే వీరిద్దరి మాటలు, చేష్టలు కూడా ఉంటాయి. ఇద్దరూ ఏకాంతంగా కూర్చుని మాట్లడటం.. పునర్నవిని డేట్‌కు పిలవడం.. ప్రపోజ్ చేస్తే ఏం సమాధానమిస్తవ్ అని రాహుల్ అడగడం.. ఇలా సరదాగా మాట్లాడుకోవడం లాంటివి చేస్తుండటతో వీరిద్దరి విషయంపై అందరూ ఆసక్తిచూపుతున్నారు. అయితే రక్షా బంధన్ సందర్భంగా బిగ్‌బాస్ ఇంటిసభ్యులు నేడు జరగబోయే ఎపిసోడ్లో రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకోనున్నారు. ఈ ఈవెంట్లో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అన్నా చెల్లెల్లుగా మారారు. రవికి రోహిణి రాఖీ కట్టగా.. అలీకి శివజ్యోతి, మహేష్‌కి అషు రాఖీ కట్టి భావోద్వేగానికి గురౌతున్నారు. అయితే పునర్నవి ఎవరికి రాఖీ కడుతుందనగా.. ‘అతనిలో మా తమ్ముడ్ని చూస్తున్నా అంటూ పునర్నవి రాహుల్ వైపు చూడటంతో.. రాహుల్ ఉలిక్కి పడుతున్నాడు. దీనితో హౌస్ మేట్స్ మొత్తం గోల గోల చేస్తున్నట్లు మనకి ప్రోమో లో కనిపిస్తుంది. అయితే రాహుల్ పక్కనే వరుణ్ సందేశ్ కూడా వున్నాడు సో ఒక వేళ వరుణ్ బ్రదర్ అని పిలిచిందేమో అన్నది నేటి ఎపిసోడ్లో తేలిపోనుంది.
రాఖీ కట్టిన పునర్నవి..షాక్ లో రాహుల్..!
Share.