సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించిన ప్రభాస్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరోలు రాజకీయాలకు ఆమడంత దూరంగా ఉంటారు..అలాంటి వారిలో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు..అయితే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు..సాహో సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ప్రభాస్… తమిళంలోని పలు టీవీ ఛానళ్లకు, వెబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభాస్ కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందన్న ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందించిన ప్రభాస్ తనకు రాజకీయాలు అంతగా తెలియవని వ్యాఖ్యానించారు… ఏపీకి యంగ్ సీఎంగా ఉన్న జగన్ బాగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. ఆయన హయాంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నట్టు ప్రభాస్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ హీరోలతో తన సంబంధాల గురించి కూడా ప్రభాస్ మాట్లాడాడు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లతో తనకు మంచి ఫ్రెండ్షిప్ ఉందని చెప్పాడు. వీళ్లు ముందు నుంచి తనకు క్లోజ్ అన్నాడు. రామ్ చరణ్‌తో తనకు చనువు తక్కువే అని చెప్పాడు ప్రభాస్. అలాగే సాహో సినిమా విశేషాలతో పాటు అనేక అంశాలపై ప్రభాస్ మాట్లాడారు.

Share.

Comments are closed.

%d bloggers like this: