లావుగా ఉన్నావన్న ప్రియుడు..కత్తెరతో పొడిచిన ప్రియురాలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

లావుగా వున్నావు, ఐస్ క్రీమ్‌ తినొద్దని బాయ్‌ఫ్రెండ్ చెప్పాడు. అంతే కోపంతో గర్ల్ ఫ్రెండ్ ఊగిపోయింది. అంతటితో ఆగకుండా కత్తెరతో బాయ్‌ఫ్రెండ్‌ను చంపేసింది. ఈ దారుణమైన ఘటన చైనా లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..చైనాలోని హెనెన్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రియుడితో కలిసి షాపింగ్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా ఐస్‌క్రీమ్ తిన్నారు. అయితే, ఆమె తనకు ఇంకా ఐస్‌క్రీమ్‌లు తినాలని ఉందని చెప్పింది. దీంతో ప్రియుడు ఆమెను వారించాడు. ‘‘ఇప్పటికే చాలా లావుగా ఉన్నావు. ఇంకా తింటే మరింత లావైపోతావు’’ అని అన్నాడు. తన ఆకృతిపై కామెంట్లు చేశాడనే కారణంతో ఆమె కోపం కట్టలు తెంచుకుంది. మాల్‌లోని ఓ దుకాణంలోకి వెళ్లి కత్తెర కొనుగోలు చేసింది. ఆ కత్తెరతో ప్రియుడిని పలుసార్లు పొడిచింది. ఈ ఘటన చూసి మాల్‌లో ఉన్న కస్టమర్లు పరుగులు తీశారు. కొందరు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఎమర్జన్సీ వైద్యులు వచ్చి అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే రక్తం పోవడంతో అతడు చనిపోయాడు. హత్య తర్వాత ఆమె అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. అయితే, పోలీసులు ఆమెను చుట్టుముట్టి అరెస్టు చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: