జగన్ బావ పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌ మోహన్ రెడ్డి బావ, బ్రదర్ అనిల్‌ కుమార్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్ జారీ అయ్యింది. 2009 ఎన్నికల సమయం నాటి కేసులో కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆయన్ను వెంటనే హాజరు పరచాలని జడ్జి వారెంట్ జారీ చేశారు. 2009 మార్చిలో ఎన్నికల సమయంలో నియమావళిని అనిల్‌కుమార్ ఉల్లఘించి ఖమ్మంలోని కరుణగిరి చర్చిలో జరిగిన కార్యక్రమంలో ఓ పార్టీకి ఓటు వేయాలంటూ కరపత్రాలు పంచారని కేసు నమోదు చేశారు. ఈ కేసులో తొలి నిందితుడిగా ఉన్న అనిల్ కుమార్ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి వారెంట్ జారీ చేశారు. అనిల్ కుమార్ ను కోర్టులో హాజరుపరచాలని ఖమ్మం రెండో అదనపు ప్రథమశ్రేణి కోర్టు న్యాయమూర్తి ఎం. జయమ్మ శుక్రవారం వారంట్ జారీ చేశారు. దీంతో అనిల్ కుమార్ సోమవారం కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: