టీడీపీ కి గుడ్ బై..బీజేపీ లోకి యామిని..?

Google+ Pinterest LinkedIn Tumblr +

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీ కి..ఆ రోజు నుంచి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. పార్టీని నేతలు వరుసగా వీడుతున్నారు. వైసీపీ లోకి అవకాశం లేకపోవడంతో అందరి చూపు బీజేపీ పై పడింది. ఎప్పుడు ఏ నాయకుడు టీడీపీ నుంచి బీజేపీలోకి వెళతారో టీడీపీ నేతలకు కూడా అర్థంకావడం లేదు. టీడీపీలోని నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ పెద్దలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన మహిళా నాయకురాలు కూడా త్వరలోనే కమలం గూటికి చేరొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధికారంలోకి ఉన్నప్పుడు ఆ పార్టీ తరపున తన వాయిస్‌ను బలంగా వినిపించిన సాదినేని యామిని… త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

కొంతకాలంగా ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణతో యామిని చర్చలు జరుపుతోందని… త్వరలోనే ఆమె బీజేపీలో చేరనుందని గుంటూరు జిల్లా రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు వైసీపీ, బీజేపీని విమర్శించడంలో టీడీపీ కీలక నేతలతో పోటీపడ్డ సాదినేని యామిని… ఎన్నికల్లో గుంటూరు అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. తన సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండే స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఆ సీటును టీడీపీ మరో నేతకు కేటాయించడంతో ఆమె నిరాశ చెందారు. ఎన్నికల తరువాత జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో… యామిని కూడా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ వార్తలకు ఊతమిచ్చేలా ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దాంతో ఆమె బీజేపీలో చేరబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: