పిడుగు పడింది..గొడుగు కాపాడింది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వర్షాకాలం వచ్చిందంటే పిడుగుల బెడద తప్పదు..ఎప్పుడు ఎక్కడ పిడుగు పడుతుందో అర్ధం కాని పరిస్థితి..ఎంత పెద్ద చెట్టునైనా కాల్చి బూడిద చేస్తుంది పిడుగు. మరి అలాంటి పిడుగు మనిషిపై పడితే? ఇంకేమైనా ఉందా..అంతే సంగతులు. అయితే, అతడు మాత్రం పిడుగు పడినా బతికే ఉన్నాడు. కారణం.. అతడు పట్టుకున్న గొడుగు. దక్షిణ కరోలినాలోని కాన్వేలో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెక్‌నిల్ అనే వ్యక్తి అకాడమీ ఫర్ టెక్నాలజీ అండ్ అకాడమిక్స్‌లో గైడెన్స్ కౌన్సెలర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఓ రోజు జోరున వర్షంలో గొడుగు వేసుకుని గార్డెన్‌లోకి వెళ్లాడు అతడు. కొద్ది దూరం నడవగానే అతడిపై పిడుగు పడింది. దీంతో షాకైన మెక్‌నిల్ గొడుగు మూసి పరుగు పెట్టాడు. ఇదంతా సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. ఆ వీడియో చూసిన తర్వాత మెక్‌నిల్.. ఆ గొడుగే లేకపోతే పిడుగుకు బలయ్యేవాడినని తెలిపాడు. ఆ వీడియోను తన ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేయగానే పిడుగుపాటు కంటే వేగంగా వైరల్ అయ్యింది. ‘‘వర్షం పడుతుంది కదా.. ఇంటికెళ్లి ఏదైనా తిందామని గొడుగు వేసుకుని బయల్దేరితే పిడుగు పడింది. ఆ సమయంలో నాకు ఏదో షాక్ కొట్టినట్లు అనిపించింది. ఇది నాకు మరో జన్మ. ఇకపై మళ్లీ పిడుగులు పడే సమయంలో బయటకు వెళ్లను’’ అని మెక్‌నిల్ వెల్లడించాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: